అమెరికాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 8.0 తీవ్రతగా నమోదు..

దక్షిణ అమెరికాకు సమీపంలోని డ్రేక్ పాసేజ్ సముద్ర మార్గంలో ఈ ఉదయం బలమైన భూకంపం సంభవించింది.;

Update: 2025-08-22 08:36 GMT

దక్షిణ అమెరికాలో ఈరోజు బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.0గా ఉంది. దక్షిణ అమెరికా మరియు అంటార్కిటికా మధ్య ఉన్న జలాల్లో శుక్రవారం బలమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం డ్రేక్ పాసేజ్‌లో సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా ఉంది. భూకంప కేంద్రం ఉపరితలం నుండి 10.8 కిలోమీటర్ల దిగువన ఉంది.

యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) ఇంతకుముందు దీని తీవ్రత 8.0గా ఉందని చెప్పింది, కానీ తరువాత దానిని 7.5కి తగ్గించింది. డ్రేక్ పాసేజ్ అనేది దక్షిణ అమెరికా దక్షిణ కొన మరియు అంటార్కిటికా మధ్య ఉన్న ఒక జలసంధి. ఇది దక్షిణ అమెరికాలోని కేప్ హార్న్ మరియు అంటార్కిటికాలోని దక్షిణ షెట్లాండ్ దీవుల మధ్య ఉంది. ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేకపోవడం ఉపశమనం కలిగించే విషయం.

భారత కాలమానం ప్రకారం, ఈరోజు ఉదయం 7.46 గంటలకు అమెరికాలోని దక్షిణ ప్రాంతంలో భూకంపం సంభవించింది.

Tags:    

Similar News