అమెరికా నుంచి భారతీయ విద్యార్థులు బహిష్కరణ.. ఒకే రోజు 21 మంది

పై చదువులు చదువుదామని అమెరికా ఫ్లైట్ ఎక్కారు.. కానీ అక్కడ ఎయిర్ పోర్టులో దిగగానే తనిఖీలు మొదలు పెట్టారు.

Update: 2023-08-18 05:59 GMT

పై చదువులు చదువుదామని అమెరికా ఫ్లైట్ ఎక్కారు.. కానీ అక్కడ ఎయిర్ పోర్టులో దిగగానే తనిఖీలు మొదలు పెట్టారు.. మీరు జత చేసిన పత్రాలు సరిగా లేవు.. మీరు మా దేశంలో ఉండి చదువుకోవడానికి అనర్హులు అని వచ్చిన దారినే వెళ్లిపోమంటూ రిటర్న్ ఫ్లైట్ ఎక్కించారు యుఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు. ఇందులో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్ధులే ఉండడం గమనార్హం.

ఒకే రోజు 21 మంది భారతీయ విద్యార్థులు అమెరికా నుంచి బహిష్కరణకు గురయ్యారు. నివేదికల ప్రకారం, తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిలో కొందరు తాము అన్ని వీసా ఫార్మాలిటీలను పూర్తి చేశామని మరియు ఉన్నత చదువుల కోసం తమ కళాశాలలకు చేరుకోవడానికి యుఎస్‌లో ల్యాండ్ అయ్యామని పేర్కొన్నారు.

ఇమ్మిగ్రేషన్ అధికారులు వారి పత్రాలను తనిఖీ చేసి, కొద్దిసేపు వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత వారిని వెనక్కి పంపించారు. వారిలో ఎక్కువ మంది అట్లాంటా, చికాగో మరియు శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయాలలో దిగారు.

తమను ఎందుకు వెనక్కి పంపారనే దానిపై తగిన సమాచారం ఇవ్వలేదని, వీసా డాక్యుమెంటేషన్‌తో దీనికి సంబంధం ఉందని విద్యార్థులు చెప్పారు. కొంతమంది విద్యార్థులు తమ ఫోన్లు, వాట్సాప్ చాట్‌లను కూడా తనిఖీ చేసినట్లు చెప్పారు.

మరికొందరు ప్రశాంతంగా వెళ్లిపోవాలని కోరారని, అభ్యంతరాలు తెలిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిస్సౌరీ, సౌత్ డకోటా రాష్ట్రాల్లోని విద్యాలయాల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వీళ్లంతా.

యుఎస్ నుంచి బహిష్కరణకు గురికావడంతో బాధలో ఉన్న విద్యార్ధులు సమయం, డబ్బు, భవిష్యత్తును కోల్పోవడంతో పాటు అనంతరం జరిగే పరిణామాల గురించి ఆందోళన చెందారు. USA నుంచి బహిష్కరణకు గురైతే మళ్లీ ఐదేళ్ల వరకు వారికి అక్కడ ఎంట్రీ ఉండదు.

Tags:    

Similar News