Facebook Privacy: డార్క్ వెబ్‌లో ఫేస్‌బుక్ ఖాతాలు.. మీ అకౌంట్‌ను కాపాడుకోండిలా..

Facebook Privacy: ప్రస్తుతం ఉన్న 5జీ కాలంలో టెక్నాలజీ మీద ఎంత ఆధారపడి ఉన్నామో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2021-10-05 12:00 GMT

Facebook Privacy: ప్రస్తుతం ఉన్న 5జీ కాలంలో టెక్నాలజీ మీద ఒక్కొక్కరు ఎంత ఆధారపడి ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫేస్‌బుక్ కాకపోతే వాట్సాప్.. అదీ కాకపోతే ఇన్‌స్టాగ్రామ్.. ఈ మూడింటి చుట్టే మన లైఫ్ అంతా చక్కర్లు కొడుతోంది. అందుకే కాసేపు ఈ యాప్స్ పనిచేయకపోతే ప్రపంచమంతా స్థంభించినట్లయింది. దీని బట్టి చూస్తేనే అర్థమవుతోంది మనకు తిండి, నిద్ర కంటే ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఎక్కువయిపోయాయని. కానీ ఇవి మనకు ఎంతవరకు ప్రైవసీ ఇస్తున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా?

టెక్నాలజీ అనేది మనకు ఎప్పుడూ పూర్తిగా ప్రైవసీ ఇవ్వదు. అది ఎప్పటినుండో మనకు తెలిసిన విషయమే. కానీ ప్రైవసీకి భంగం కలుగుతుందన్న విషయాన్ని కూడా పట్టించుకోలేనంతగా టెక్నాలజీ మాయలో మనందరం మునిగిపోయాం. ఫేస్‌బుక్ వల్ల ప్రజల ప్రైవసీ దెబ్బతింటుందని ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకమ్‌బర్గ్‌ ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దాని వల్లే ఆర్థికంగా నష్టపోయాడు కూడా. తాజాగా 1.5 బిలియన్ ఫేస్‌బుక్ యూజర్ల డేటా డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉందని రష్యన్‌ ప్రైవసీ అఫైర్స్‌ ఆఫీసర్ ట్వీట్ చేసారు.

ఫేస్‌బుక్‌ యూజర్లు తమ డేటా చోరికి గురవ్వకుండా ఉండడం కోసం 2 ఫ్యాక్టర్ అథంటికేషన్ పాస్‌వర్డ్‌ను యూజర్లు తమ ఖాతాలకు ఏర్పాటు చేయడం మంచిది. అంతేకాకుండా స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌లను కూడా తమ ఫేస్‌బుక్‌ అకౌంట్లకు ఏర్పాటు చేసుకోవాలని పలువురు టెక్నికల్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు. మార్క్ ఫేస్‌బుక్ వాడడం వల్ల ఏ హాని జరగదని ఎన్నిసార్లు వెల్లడించినా సైబర్ నేరగాళ్లు మాత్రం అది కుదరదని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు.

Tags:    

Similar News