సౌత్ కొరియా బ్యాటరీ ఫ్యాక్టరీలో మంటలు.. 20 మంది మృతి

దక్షిణ కొరియాలోని లిథియం బ్యాటరీ కర్మాగారంలో సోమవారం భారీ స్థాయిలో మంటలు చెలరేగడంతో దాదాపు 20 మంది మరణించారని యోన్‌హాప్ వార్తా సంస్థ తెలిపింది.;

Update: 2024-06-24 10:49 GMT

దక్షిణ కొరియాలోని లిథియం బ్యాటరీ కర్మాగారంలో సోమవారం భారీ మంటలు చెలరేగడంతో దాదాపు 20 మృతి చెందినట్లు యోన్‌హాప్ వార్తా సంస్థ తెలిపింది. 

ఫ్యాక్టరీలో 100 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. రెండవ అంతస్తు నుండి వస్తున్న వరుస పేలుళ్ల శబ్ధం విని భయంతో పరుగులు పెట్టారు. ఇక్కడ లిథియం-అయాన్ బ్యాటరీలను తనిఖీ చేసి ప్యాక్ చేస్తారు అని అగ్నిమాపక సిబ్బంది కిమ్ జిన్-యంగ్ మీడియాకు తెలిపారు.

దాదాపు 78 మంది వ్యక్తులు సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారించారు. మరికొంత మంది జాడ తెలియలేదు. రెస్క్యూ సిబ్బంది లోపలికి ప్రవేశించిన తర్వాత సైట్‌లో "సుమారు 20 మృతదేహాలు కనుగొన్నారు" అని యోన్‌హాప్ చెప్పారు.

అతిపెద్ద మంటలను ఆర్పగలిగామని, కాలిపోయిన భవనం నుంచి మృతదేహాలను బయటకు తీస్తున్నామని కిమ్ మీడియాకు తెలిపారు. విస్తారమైన కర్మాగారంలో రెండవ అంతస్తులో 35,000 బ్యాటరీ సెల్‌లు ఉన్నాయని అంచనా వేయబడింది, ఇతర ప్రాంతాల్లో మరిన్ని బ్యాటరీలు నిల్వ చేయబడ్డాయి.

లిథియం బ్యాటరీలు వేగంగా కాలిపోతాయి. ఈ మంటలను సాధారణ పద్ధతులతో నియంత్రించడం కష్టం. "పేలుళ్ల భయం కారణంగా, లోపలికి ప్రవేశించడం కష్టమైంది" అని కిమ్ చెప్పారు.

"ఇది లిథియం బ్యాటరీ కాబట్టి, నీటిని చల్లడం వల్ల మంటలు ఆరిపోవని మేము నిర్ధారణకు వచ్చి,  ప్రస్తుతం పొడి ఇసుకను ఉపయోగించి మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాము" అని ఆయన చెప్పారు.

లిథియం బ్యాటరీ ప్లాంట్ దక్షిణ కొరియాకు చెందిన ప్రైమరీ బ్యాటరీ తయారీదారు అరిసెల్ యాజమాన్యంలో ఉంది. ఇది రాజధాని సియోల్‌కు దక్షిణంగా హ్వాసోంగ్ నగరంలో ఉంది. ల్యాప్‌టాప్‌ల నుండి ఎలక్ట్రిక్ వాహనాల వరకు ప్రతిదానిలో లిథియం బ్యాటరీలు ఉపయోగించబడతాయి.

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ "కార్మికులను రక్షించడంపై దృష్టి పెట్టడానికి అందుబాటులో ఉన్న అన్ని పరికరాలను సమీకరించాలని" అధికారులకు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. హ్వాసోంగ్‌లోని అధికారులు ఫ్యాక్టరీ చుట్టు పక్కల  నివాసితులకు వరుస హెచ్చరికలను పంపి ఇంటి లోపలే ఉండమని హెచ్చరిస్తున్నారు.

ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించే బ్యాటరీలతో సహా దక్షిణ కొరియా ప్రధాన ఉత్పత్తిదారు. దీని బ్యాటరీ తయారీదారులు టెస్లాతో సహా ప్రపంచవ్యాప్తంగా EV తయారీదారులను సరఫరా చేస్తారు.

హై-ఎండ్ సెమీకండక్టర్ల యొక్క ప్రపంచంలోని అతిపెద్ద ఉత్పత్తిదారులలో దక్షిణ కొరియా కూడా ఒకటి.  డిస్ప్లేలు, బ్యాటరీలతో సహా కీలక సాంకేతికతలపై ప్రభుత్వం భారీగా పెట్టుబడి పెట్టింది.

Tags:    

Similar News