రష్యాలో వైద్య విద్యనభ్యసిస్తున్న నలుగురు భారతీయ విద్యార్ధులు.. నదిలో మునిగి మృతి

ఈ విద్యార్థులు వెలికి నొవ్‌గోరోడ్ స్టేట్ యూనివర్శిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపారు.;

Update: 2024-06-07 06:40 GMT

రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపంలోని నదిలో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మునిగిపోయారు. రష్యాలోని భారత రాయబార కార్యాలయం మృతదేహాలను వీలైనంత త్వరగా వారి బంధువులకు పంపించడానికి రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. 

నలుగురు విద్యార్థులు - 18-20 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. వెలికి నొవ్‌గోరోడ్ నగరంలోని సమీపంలోని నొవ్‌గోరోడ్ స్టేట్ యూనివర్శిటీలో చదువుతున్నారు.

వోల్ఖోవ్ నదిలో మునిగిపోతున్న ఒక భారతీయ విద్యార్థిని రక్షించేందుకు నలుగురు సహచరులు ప్రయత్నిస్తున్న క్రమంలో వారు కూడా మునిగి పోయారని స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. అయితే ఒక యువకుడిని స్థానికులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

"మేము మృతదేహాలను వీలైనంత త్వరగా బంధువులకు పంపించడానికి కృషి చేస్తున్నాము. ప్రాణాలను రక్షించిన విద్యార్థికి కూడా సరైన చికిత్స అందించబడుతోంది" అని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం X లో తెలిపింది. "ప్రాణాలు కోల్పోయిన విద్యార్ధుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి" అని X లో పోస్ట్ చేసింది.


Tags:    

Similar News