Pakistan: పాకిస్థాన్ లో ఘనంగా వినాయక నిమజ్జనం

దాయాది దేశంలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలు

Update: 2025-09-07 03:00 GMT

గణపతి ఉత్సవాలను దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులు ఘనంగా జరుపుకున్నారు. వినాయక విగ్రహానికి పూజలను చేసి నిమజ్జనం చేశారు. మన దాయాది దేశం పాకిస్తాన్ లో గణపతి ఉత్సవాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా పాకిస్థాన్ లో ఘనంగా గణేష్ నిమజ్జనం నిర్వహించారు.

పాకిస్థాన్ లోని హిందువులు ఘనంగా గణేష్ ఉత్సవాలను నిర్వహించారు. కరాచీలో గణపతి నవరాత్రి ఉత్సవాలను అక్కడి హిందువులు ఘనంగా జరుపుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే గణపతి విగ్రహాన్ని గంగమ్మ ఒడికి చేర్చే సమయంలో కరాచీ వీధుల్లో ఒక ఆటో మీద పెట్టి వైభవంగా ఊరేగిస్తూ తీసుకుని వెళ్తున్నారు. ఇలా గణపయ్య తన తల్లి ఒడిలో చేరేందుకు వెళ్తున్న సమయంలో వీధిలో ఉన్నవారిని ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తుంటే… నిమజ్జనం కోసం ఆటోలో తీసుకెళ్తున్న సన్నివేశాన్ని పాకిస్థానీ ముస్లింలు నోరు ఎల్లబెట్టి మరీ చూస్తున్నారు. భక్తులు ‘గణపతి బప్పా మోరియా’ అని జపిస్తూ నృత్యం చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Tags:    

Similar News