Grammy Awards: 12వ సారి గ్రామీ అందుకున్న టేలర్

బెస్ట్ మ్యూజిక్ వీడియో విభాగంలో టేలర్ స్విఫ్ట్ కు గ్రామీ పురస్కారం;

Update: 2023-02-06 07:14 GMT

పాప్ ప్రపంచాన్ని తన స్వరాలతో ఉర్రూతలూగిస్తోన్న టేలర్ స్విఫ్ట్ మరో గ్రామీని తన ఖాతాలో వేసేసుకుంది. 'ఆల్ టూ వెల్' అనే ఆల్బమ్... బెస్ట్ మ్యూజిక్ వీడియో కాటగిరీలో పురస్కారాన్ని గెలుపొందింది. అడెలే, బీటీఎస్, డోజా క్యాట్, హారీ స్టైల్స్, కెన్డ్రిక్ లామర్ వంటి దిగ్గజాలతో పోటీ పడి  ఈ ఆల్బమ్ సంగీత ప్రపంచంలో అత్యుత్తమ పురస్కారంగా భావించే గ్రామీని సొంతం చేసుకుంది. 'ఆల్ టూ వెల్ :  ది షార్ట్ ఫిల్మ్' టేలర్ స్వీయ దర్శకత్వంలో రూపొందడం మరో విశేషం. తాజా గెలుపుతో  టేలర్ తన కెరీర్ లో మొత్తం 12 గ్రామీ పురస్కారాలను కైవసం చేసుంది. పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి టేలర్ స్వయంగా రాలేకపోయినా ఈమేరకు అమ్మడు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. మాటల్లో చెప్పలేని ఆనందాన్ని పొందుతున్నానని ట్వీట్ ద్వారా వెల్లడించిన టేలర్, ఈ సందర్భంగా తనకు అన్ని విధాలా తర్పీదు ఇచ్చిన గురువులకు కృతజ్ఞతలు తెలియజేసింది. 

Tags:    

Similar News