Houthi Rebals: మరోసారి రెచ్చిపోయిన హౌతీ రెబల్స్‌..

24 వేలు దాటిన మరణాలు..;

Update: 2024-01-16 06:00 GMT

ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు  మరోసారి రెచ్చిపోయారు. యెమెన్‌ తీరంలో అమెరికాకు చెందిన ఓ కంటయినర్‌ షిప్‌పై దాడి చేశాయి. అయితే, ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అమెరికా ఆర్మీ తెలిపింది.

గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌లో మార్షల్‌ ఐలాండ్‌ జెండాతో వెళ్తున్న కంటెయినర్‌ షిప్‌ గిబ్రాల్టర్‌ ఈగల్‌ పై హౌతీ రెబల్స్‌ దాడికి పాల్పడినట్లు వెల్లడించింది. యాంటి షిప్‌ బాలిస్టిక్‌ క్షపణులతో దాడి చేసినట్లు తెలిపింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం, షిప్‌కు ఎలాంటి నష్టం జరగలేదని యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ పేర్కొంది. కాగా, ఈ దాడి తామే చేసినట్లు హౌతీ రెబెల్స్ ప్రకటించారు.

ఎర్రసముద్రంలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. హౌతీ తిరుగుబాటుదారులు నానాటికీ రెచ్చిపోతున్నారు. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులకు నిరసనగా గత కొన్ని రోజులుగా హౌతీ తిరుగుబాటుదారులు రెడ్‌ సీలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో హౌతీల దాడులకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా మిత్రపక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. యెమెన్‌ హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా, బ్రిటన్‌ ముప్పేట దాడికి దిగాయి. ఎర్రసముద్రంలో ఉద్రిక్తతలు రాజేసిన హౌతీలకు చెందిన డజనుకు పైగా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఇరుదేశాల సైన్యాలు పెద్దయెత్తున బాంబు దాడులు చేశాయి. అయినా హౌతీలు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. పైగా ఎర్రసముద్రంలో దాడులను ఆపబోమని స్పష్టం చేశారు. తమపై దాడి చేసిన అమెరికా, బ్రిటన్‌ దేశాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.  

తమ దేశంపై దాడికి దిగుతున్న అమెరికా, బ్రిటన్ కు చెందిన యుద్ధనౌకలను తాము వదిలపెట్టమని వారు హెచ్చరికలు జారీ చేశారు. వారిని తమ శత్రువులుగానే పరిగణిస్తామని చెప్పారు. హౌతీ తిరుగుబాటు దారులపై బ్రిటన్, అమెరికా సేనలు దాడులు చేస్తుండటంతో హౌతీ రెబల్స్ కూడా ఎదురుదాడికి దిగుతున్నారు. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని వాటిపై దాడులు చేస్తూ నష్టపర్చాలని నిర్ణయించారు.

 

Tags:    

Similar News