Andaman And Nicobar Islands : బిగ్గెస్ట్ డ్రగ్స్ ఆపరేషన్అం డమాన్‌ తీరంలో

కోస్ట్‌గార్డ్‌ చరిత్రలో ఇదే అత్యధికం

Update: 2024-11-26 00:30 GMT

 అండమాన్‌ తీరంలో ఏకంగగా 6 టన్నుల మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఓ చేపల పడవలో తరలిస్తుండగా ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ దీనిని స్వాధీనం చేసుకుని, ఆరుగురు మయన్మార్‌ జాతీయులను అరెస్ట్‌ చేసింది. ఐసీజీకి చెందిన డోర్నియర్‌ విమానం పైలట్‌ ఈ నెల 23న బారెన్‌ ద్వీపంలో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న పడవను గుర్తించారు. దీంతో ఐసీజీ గగనతల, సముద్ర మార్గాల్లో సమన్వయంతో పని చేసి, ఈ నెల 24న ఈ పడవను పట్టుకున్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో కోట్ల రూపాయల విలువ చేసే మెథాంఫేటమిన్‌ను 2 కిలోల చొప్పున 3 వేల ప్యాకెట్లలో తరలిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 23న కోస్ట్ గార్డ్ డోర్నియర్ విమానం పైలట్ సాధారణ పెట్రోలింగ్‌లో ఉన్నప్పుడు, పోర్ట్ బ్లెయిర్ నుంచి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బారెన్ ద్వీపంలో ఒక ఫిషింగ్ బోటు అనుమానాస్పద కదలికను గమనించినట్లు డిఫెన్స్ అధికారి తెలిపారు.

అ సమయంలో ట్రాలర్ బోటు వేగాన్ని తగ్గించమని కోరాడని, ఇంతలో పైలట్ అండమాన్ నికోబార్ అధికారులకు విషయాన్ని చేరవేశారని తెలిపారు. దీంతో వెంటనే పెట్రోలింగ్ నౌకలు బారెన్ ద్వీపం వెళ్లాయని తెలిపారు. ఆ తర్వాత స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ కోసం నవంబర్ 24న ఫిషింగ్ బోటును పోర్ట్ బ్లెయిర్‌కు తీసుకొచ్చామని వెల్లడించారు. ఆరుగురు మయన్మార్ జాతీయులను అరెస్టు చేశామని అధికారి తెలిపారు.

ఇటీవల కాలంలో స్మగ్లింగ్‌పై మాదకద్రవ్యాల నిరోధక విభాగాలు తీవ్ర స్థాయిలో దాడులు చేస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం గుజరాత్‌ వద్ద భారత ప్రాదేశిక జలాల్లో దాదాపు 700 కిలోల మెథ్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ఈ సందర్భంగా ఇరాన్‌కు చెందిన 8 మందిని అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్‌ ఇన్‌పుట్స్‌ ఆధారంగా సాగర్‌ మథన్-4 ఆపరేషన్‌లో భాగంగా వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాదే సముద్ర మార్గంలో తరలిస్తున్న 3,500 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్‌కు చెందిన 11 మంది, పాకిస్థాన్​కు చెందిన 14 మందిని అరెస్టు చేసి మూడు కేసులు నమోదు చేశారు.

Similar News