UK Nurse: నర్సు కాదు... నరరూప రాక్షసి

బ్రిటన్‌లో ఉన్మాది నర్సు ఘాతుకం... కళ్లు తెరవని ఏడుగురు చిన్నారులను హత్యే చేసిన నర్సు... దోషీగా తేల్చిన కోర్టు

Update: 2023-08-20 01:00 GMT

కంటికి రెప్పలా నవజాత శిశువుల్ని(harmed babies ) చూసుకోవాల్సిన నర్సు(UK Killer Nurse) మానవత్వాన్ని మరిచి రాక్షసిలా మారింది. ఆసుపత్రిలో ఎవ్వరికీ అనుమానం రాకుండా ఏడుగురు శిశువులను చంపేసింది. వైద్య వృత్తికి, మానవత్వానికి మచ్చ తెచ్చేలా పసికందుల ఉసురు తీసిన నర్సు(British nurse ) ఉదంతం బ్రిటన్‌లో సంచలనం సృష్టించింది. ఈ దారుణంలో దర్యాప్తు లోతులో విస్మయకర నిజాలు బయటపడుతున్నాయి. ఇంగ్లండ్‌లోని చెస్టర్‌లో కౌంటెస్‌ ఆఫ్‌ చెస్టర్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న 33 ఏళ్ల లూసీ లెబ్టీ(Lucy Letby, 33 ) ఈ దారుణాలకు ఒడిగట్టింది. లూసీ 2015-16 మధ్య కాలంలో ఈ హత్యలకు పాల్పడింది. ఆస్పత్రిలో ఎటువంటి స్పష్టమైన కారణాలు లేకుండా, ఆకస్మికంగా ఆరోగ్యం విషమించి ఏడుగురు శిశువులు మృతి చెందారు అక్కడే జన్మించిన శిశువులు, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేసిన పసిపిల్లల శరీరాల్లోకి విషాన్ని ఎక్కించడం, రక్తనాళాల్లోకి గాలిని, నీటిని పంపించడం వంటి దారుణాలకు ఒడిగట్టింది. కొన్నిసార్లు బలవంతంగా ఎక్కువ పాలు పట్టించడం, ఇన్సులిన్‌ ఎక్కించడం(poisoning them with insulin ) వంటి అరాచకాలకు పాల్పడి శిశివులను పొట్టన బెట్టుకుంది. మరో ఆరుగురు శిశువులను చంపేందుకు లెట్బీ విఫలయత్నం చేసింది.


ఓవైపు శిశువులను దారుణంగా హత్య చేస్తూ మరోవైపు తనను ఎవరూ గుర్తించకుండా లూసీ(serial killer ) దొంగ నాటకాలు ఆడింది. శిశువుల మరణాలపై విషాదకరమైన సందేశాలను తన సహోద్యోగులకు పంపింది. ఆ విధంగా సానుభూతి పొందేందుకూ, తనపై అనుమానం రాకుండా అనేక డ్రామాలు ఆడింది. తొలిసారి శిశువును చంపినప్పుడు ఆ తల్లిదండ్రులను కలుసుకునేందుకు బాధగా ఉందంటూ సిబ్బందికి మెస్సేజ్‌ చేసింది. శిశు మరణం తీవ్రంగా కలచి వేస్తోందనీ, దీని నుంచి బయటపడేందుకు అదనపు విధులు నిర్వహిస్తానని మేనేజర్‌ను కోరింది. మనకే ఇంత బాధగా ఉంటే శిశువుల తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో అంటూ సందేశాలు పంపింది.


చివరకు లూసీ పాపం పండటంతో భారత సంతతి వైద్యుడు రవి జయరాం, ఇతర వైద్యులు చేసిన ఫిర్యాదుతో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదే ఆసుపత్రిలో జయరాం పిల్లల వైద్యుడిగా సేవలందిస్తున్నారు. 2015 జూన్‌లో ముగ్గురు పసికందులు ప్రాణాలు కోల్పోగా లూసీపై జయరాంకు అనుమానం వచ్చింది. ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్స్‌కు ఆమె గురించి చెప్పారు. అయితే వారు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. 2017లో పోలీసులకు ఉదంతాన్ని చెప్పగా దర్యాప్తు ప్రారంభించి లూసీని అరెస్టు చేశారు.


విచారణలో లూసీ మానసిక స్థితిపై ఆరా తీసిన పోలీసులు ఆమె శిశువులను హింసించి ప్రాణం తీస్తూ దేవుడిలా ఊహించుకునేదని తెలుసుకున్నారు. ఆమె ఇంట్లో సోదాలు చేయగా పిచ్చిరాతలు రాసిన కాగితం దొరికింది. అందులో తాను దెయ్యాన్ని అని(“I am evil I did this ) రాసి ఉంది. తాను పిల్లలను చూసుకునేంత మంచిదాన్ని కాదని, అందుకే చంపేశానని రాసి ఉన్న మరో డైరీ దొరికింది. మరో నోట్‌లో తనకు పిల్లలు పుట్టరని, తాను పెళ్లి చేసుకోనని రాసింది. ఇతరులు బాధపడితే చూసి ఆనందించేదని పోలీసులు చెప్పారు.


కళ్లు కూడా తెరవని ఏడుగురు నవజాత శిశువులను చంపిన సీరియల్‌ కిల్లర్‌ లూసీలెట్బీని యూకే కోర్టు దోషిగా తేల్చింది. 2020లో ఆమెపై అభియోగాలు నమోదు కాగా... ఇప్పుడు ఆ నరహంతకి దోషిగా తేలింది. తనకు ఎప్పటికీ పెళ్లి కాదని, పిల్లలు పుట్టరని, కుటుంబాన్ని కలిగి ఉంటే వచ్చే భావన కూడా తనకు తెలియదని మరో నోట్‌లో ఉంది. ఇవన్నీ చూస్తుంటే నిరాశ, మానసిక వేదనతోనే లూసీ ఈ దారుణాలకు పాల్పడి ఉంటుందని దర్యాప్తు అధికారులు అనుమానించారు.

Tags:    

Similar News