Narendra Modi: మోదీ రాసిన గుజరాతీ కవిత చదివిన ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని

టొబాగోలోని ఓ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం;

Update: 2025-07-04 06:00 GMT

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  విదేశీ పర్యటన కొనసాగుతోంది. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ట్రినిడాడ్ అండ్ టొబాగో లో పర్యటిస్తున్నారు. టొబాగో చేరుకున్న మోదీకి ఆ దేశ ప్రధాని ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాతీలో రాసిన కవితను ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో ప్రధాని   కమ్లా ప్రసాద్‌ బిసెస్సార్‌ చదవి వినిపించారు.

గుజరాతీ భాషలో ‘ఆంఖ్ ఆ ధన్య ఛే’ పేరిట మోదీ రాసిన పుస్తకంలోని కవితను   వినిపించిం అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ‘గడిచిపోయిన రోజుల్లోకి మనసుతో ప్రయాణించినప్పుడు ఎన్నో జ్ఞాపకాలు కళ్లముందు కదలాడతాయి. కష్టకాలంలో మనతో నడిచిన వారిని ఎప్పటికీ మర్చిపోలేం. ఆ జ్ఞాపకాలే మన ప్రయాణంలో భాగమవుతాయి’ అని అర్థం వచ్చే కవితనను అందరి సమక్షంలో చదివి వినిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో జనాభాలో దాదాపు 40 శాతం మంది భారత సంతతికి చెందినవారే. భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం, ఈ దేశంలో సుమారు 5.56 లక్షల మంది భారతీయ మూలాలున్న ప్రజలు నివసిస్తున్నారు. ఇక ఆ దేశ ప్రధాని కమ్లా కూడా భారత మూలాలున్న వ్యక్తే కావడం విశేషం. ఈ సందర్భంగా కమ్లాను బీహార్‌ ముద్దుబిడ్డగా ప్రధాని పేర్కొన్నారు. ఆమె పూర్వీకులు బీహార్‌ బక్సర్‌కు చెందిన వారని తెలిపారు. అందుకే కమ్లాను బీహార్‌ ఆడబిడ్డగా భావిస్తారన్నారు.

Tags:    

Similar News