Texas: భారత సంతతి కంప్యూటర్ ఇంజినీర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
ఇమేజింగ్ టెక్నాలజీలో విప్లవాత్మక పరిశోధనలకు గాను అరుదైన గుర్తింపు;
ఇమేజింగ్ సాంకేతికతలో విప్లవాత్మక పరిశోధనలు చేసిన భారత సంతతి శాస్త్రవేత్త అశోక్ వీరరాఘవన్‌కు ప్రతిష్ఠాత్మక ఈడిత్ అండ్ పీటర్ ఓ డానల్ అవార్డు దక్కింది. భారత సంతతికి చెందిన ప్రముఖ కంప్యూటర్ ఇంజినీర్కు అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. టెక్సాస్‌లో అత్యున్నత అకడమిక్ అవార్డుగా పేరొందిన ‘ఎడిత్ అండ్ పీటర్ ఓడన్నెల్’ దక్కింది. ఆ రాష్ట్రంలో ఆయా రంగాల్లో అత్యుత్తమ పరిశోధనలు చేసిన వారికి ప్రతి ఏటా ‘టెక్సాస్ అకాడమీ ఆఫ్ మెడిసిన్, ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్సాలజీ’ఈ అవార్డును బహూకరిస్తుంది.
ఈ ఏడాది ఇంజినీరింగ్ విభాగంలో చేసిన కృషికిగానూ వీర రాఘవన్‌కు ఈ అవార్డు వరించింది. చెన్నైలో పుట్టిపెరిగిన ఆయన ప్రస్తుతం హూస్టన్‌లోని రైస్ యూనివర్సిటీ కి చెందిన జార్జ్ ఆర్.బ్రౌన్ స్కూల్‌లో కంప్యూటర్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వీరరాఘవన్ బృందం ఇమేజింగ్ టెక్నాలజీలో పలు విప్లవాత్మక పరిశోధనలు చేస్తోంది. ‘ఇమేజింగ్ సాంకేతికత’లో ఆయన చేసిన విప్లవాత్మక పరిశోధనలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఆప్టిక్స్ నుంచి సెన్సార్ డిజైన్ వరకూ మెషిన్ ఆల్గొరిథమ్ సాంకేతికతో ఇమేజింగ్ రంగంలోని పలు సవాళ్లను అధిగమించారు. ఈ అంశాలన్నిటిపైనా సమీకృత విధానంలో పరిశోధన చేస్తున్నామని ప్రొ. వీరరాఘవన్ తెలిపారు. ప్రస్తుత సాంకేతికతతో చూడటం సాధ్యం కాని వాటిని కనిపించేలా చేయడమే తమ లక్ష్యమని వీరరాఘవన్ తెలిపారు.
ఈ అవార్డు అందుకోవడం పట్ల వీరరాఘవన్ సంతోషం వ్యక్తం చేశారు. వర్సిటీలోని కంప్యూటేషన్ ఇమేజింగ్ ల్యాబ్‌లో చాలా మంది విద్యార్థులు, పోస్ట్‌డాక్టోరల్స్, రీసెర్చ్ సైంటిస్ట్‌లు గత దశాబ్ద కాలంగా చేసిన అద్భుతమైన, వినూత్న పరిశోధనలకు ఇది గుర్తింపు అని పేర్కొన్నారు. ప్రస్తుత ఇమేజింగ్ టెక్నాలజీలో చాలా సమస్యలున్నట్లు తెలిపారు. కాంతి ప్రసరించడకుండా అడ్డంకులున్న చోట మనకు కావాల్సిన వాటిని చూడలేకపోతున్నామన్నారు. దీనిని అధిగమించేందుకు తాము చేసిన పరిశోధనలు చాలా వరకు పరిష్కారాన్ని కనుగొన్నట్లు ఆయన వివరించారు.