Indonesia: ఇండోనేసియాలో బద్ధలైన అగ్నిపర్వతం..

6 కి.మీ. ఎత్తుకు ఎగసిన బూడిద;

Update: 2025-05-20 01:30 GMT

ఇండోనేషియాలో భారీ విస్ఫోటనం జరిగింది. లెవోటోబి లకి-లకి పర్వతం బద్ధలైంది. దీంతో శిఖరం నుంచి బూడిద మేఘం వైపు 6 కి.మీ ఎత్తుకు ఎగిసిపడింది. సోమవారం ఉదయం పర్యాటక ద్వీపమైన ఫ్లోర్స్‌లోని ఉదయం 09:36 గంటలకు లెవోటోబి లకి-లకి అగ్నిపర్వతం మరోసారి పేలిందని జియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. వెంటనే అధికారులు దేశంలో అత్యున్నత స్థాయి హెచ్చరిక జారీ చేశారు. సమీప ప్రాంత ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

పెద్ద విస్ఫోటనం సంభవించే అవకాశం ఉందని ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ హెడ్ ముహమ్మద్ వాఫిద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం జరిగిన వరుస విస్ఫోటనాల కారణంగా లకి-లకి శిఖరం నుంచి ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద వెలువడిందని అగ్నిపర్వత శాస్త్ర సంస్థ తెలిపింది. అగ్నిపర్వత బూడిద నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఫేస్ మాస్క్‌లు ధరించాలని వాఫిద్ నివాసితులను కోరారు. అదే సమయంలో బిలం నుంచి కనీసం ఆరు కిలోమీటర్ల దూరంలో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలు కురిస్తే ఒక రకమైన బురద సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. గత నవంబర్‌లో కూడా మౌంట్ లెవోటోబి లకి-లకి అనేకసార్లు విస్ఫోటనం చెందింది. అప్పుడు తొమ్మిది మంది మరణించారు. బాలికి అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. వేలాది మందిని ఖాళీ చేయించారు. మరోసారి అంత కంటే పెద్ద స్థాయిలో విస్ఫోటనం జరిగింది.

Tags:    

Similar News