Isis Bride: ‘ఐసిస్‌ పెళ్లికూతురి’కి మరోసారి షాకిచ్చిన కోర్టు

అన్నీ తెలిసే సిరియాకు ..రియల్ కేరళ క్రైమ్ స్టోరీ ఇది

Update: 2024-02-25 03:30 GMT

పదిహేనేళ్ల వయసులో సిరియాకు పారిపోయి ఇస్లామిక్ ఉగ్రవాదిని పెళ్లాడి, ఆ సంస్థలో చేరిన బ్రిటన్‌కు చెందిన షమీమా బేగం.. తిరిగి యూకే పౌరసత్వం కోసం న్యాయపోరాటం చేస్తోంది. దాదాపు 9 ఏళ్ల కిందట ఆమె సిరియాకు మరో ఇద్దరితో కలిసి పారిపోయి.. ఇస్లామిక్ ఉగ్రవాదిని వివాహం చేసుకుంది. దీంతో షమీమాను ‘ఐసిస్‌ పెళ్లికూతురు’గా వ్యవహరించేవారు. తనను తిరిగి బ్రిటన్ పౌరురాలిగా గుర్తించాలని కోరుతూ షమీమా బేగం వేసిన పిటిషన్‌ను ‘స్పెషల్‌ ఇమిగ్రేషన్‌ అప్పీల్స్‌ కమిషన్‌ (SIAC)’ గతంలో తిరస్కరించింది. తాజాగా, అప్పీల్‌ కోర్టు ఎస్ఐఏసీ తీర్పుతో ఏకభవించింది. ఆమె అన్నీ తెలిసే సిరియాకు వెళ్లి ఉగ్రవాదులతో చేరాలని నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. “షమీమా బేగంను ఇతరులు ప్రభావితం చేసి ఉండొచ్చు.. కానీ, సిరియాకు వెళ్లి ఉగ్రవాద సంస్థలో చేరే అంశంలో అన్నీ తెలిసే నిర్ణయం తీసుకున్నారు” అని పేర్కొంది.

ఇక ఈమె వయస్సు ఇప్పుడు 24 ఏళ్ళు. ప్రస్తుతం ఉత్తర సిరియాలోని శరణార్థి శిబిరంలో ఉంది. స్వతహాగా బంగ్లాదేశ్‌ కు చెందిన షమీమా బేగం 2015 ఫిబ్రవరిలో యూకే నుంచి సిరియాకు వెళ్లిపోయింది. ఆ సమయంలో ఆమెతో పాటు మరో ఇద్దరు బాలికలు కూడా వెళ్లారు. కాగా, అక్కడే అక్కడే డచ్‌కు చెందిన ఐసిస్‌ ఉగ్రవాది యగో రీడ్జిక్‌ను పెళ్లి చేసుకుంది. కాబట్టి ఆమెను ‘ఐసిస్‌ పెళ్లికూతురు’ అని పిలిచేవారు. అయితే, 2019 ఫిబ్రవరిలో సిరియా శరణార్థుల శిబిరంలో.. ఆమె కనిపించగా .. బ్రిటన్‌ హోంశాఖ ఆమె పౌరసత్వాన్ని రద్దు చేసింది. అప్పుడు ఆమె ఆ నిర్ణయాన్ని తిరస్కరిస్తూ.. కోర్టును ఆశ్రయించింది. కానీ , 2021 లో యూకే సుప్రీంకోర్టు మాత్రం ఆమె తిరిగి స్వదేశంలో అడుగుపెట్టడానికి వీలు లేదంటూ.. తీర్పు ఇచ్చింది. జాతీయ భద్రత ముందు మరేదీ ముఖ్యం కాదంటూ.. ఆమె పౌరసత్వాన్ని రద్దు చేయడం సరైనదే అంటూ.. హోంశాఖ కోర్టు నిర్ణయాన్ని సమర్ధించింది. కానీ, దానిపై ఆమె అప్పీల్‌కు వెళ్లగా.. ఎట్టకేలకు 2022లో తన నిర్ణయం సరైందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కాగా, ఆమె బ్రిటీష్ పౌరసత్వాన్ని తొలగించే నిర్ణయం కఠినమైందా.. లేదా తన దురదృష్టానికి స్వయంగా ఆమె బలైందా.. అని నిర్ణయించడం న్యాయస్థానం పని కాదు అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఆమె స్వయంగా చెప్పిన మాటలను “షమీమా బేగం ఇతరులతో ప్రభావితమై ఉండొచ్చు.. ఎవరైనా నియంత్రించి ఉండొచ్చు.. కానీ అన్నీ తెలిసిన తర్వాతే సిరియాకు వెళ్లి ఐసిస్‌తో జతకట్టడానికి నిర్ణయం తీసుకుంది”. అంటూ న్యాయమూర్తి జస్టిస్ డేమ్ స్యూ కార్ అన్నారు. కానీ , ఆమె బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్ కోరుతుందని బ్రిటన్ ప్రభుత్వం పేర్కొనగా.. ఆమె కుటుంబసభ్యులు మాత్రం యూకే పౌరురాలైన తమ కుమార్తె.. బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్ ఎప్పుడూ కోరలేదని చెప్పారు. 

Tags:    

Similar News