Hamas - Israel war: ఇజ్రాయెలీ బందీలను వదిలేందుకు సిద్ధమే.. కానీ

ఖైదీల మార్పిడికి సిద్ధంగా ఉన్నామన్న హమాస్‌;

Update: 2023-10-29 03:45 GMT

ఇజ్రాయెల్‌ జైళ్లలో మగ్గుతున్న తమ దేశ పౌరులను విడుదల చేస్తే.. వెంటనే బందీలను వదలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ ప్రకటించింది. అందరినీ ఒకేసారి విడిచిపెట్టాలని హమాస్‌ లీడల్‌ యష్వసిన్వార్‌ షరతు విధించారు. మాస్కోతో జరిగిన చర్చల మేరకు 8 మంది రష్యన్‌-ఇజ్రాయెలీస్‌ పౌరులను విడిచిపెట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. హమాస్‌ను ఉగ్రసంస్థగా గుర్తించేందుకు రష్యా నిరాకరిస్తోన్న నేపథ్యంలో మాస్కోతో ఆ సంస్థకు మంచి సంబంధాలున్నాయి. అటు.. యుద్ధం వల్ల అమాయకులు పసిపిల్లలు, మహిళలే మరణిస్తున్నారనీ.. ఈ అమానవీయ పోరును తక్షణం ఆపాలంటూ తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డోగాన్‌ వ్యాఖ్యలను ఇజ్రాయెల్‌ ఖండించింది. తుర్కియేలోని తమ దౌత్య సిబ్బందిని ఇజ్రాయెల్‌ వెనక్కిపిలిపించింది. కాగా ఇజ్రాయెల్ దాడులతో గాజా స్మశానంగా మారింది. వివిధ దేశాలు ఆహారం, ఇంధనం, మందులను పంపిస్తున్నా వాటి రవాణాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఆస్పత్రుల్లో అత్యవసర స్థితిలో ఉన్న క్షతగాత్రుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి.


హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై దాడులను ఇజ్రాయెల్‌ తీవ్రతరం చేస్తోంది. పదాతి దళం, సాయుధ వాహనాలు గాజావైపునకు దూసుకెళ్తున్నాయి. వాటికి దన్నుగా విమానాలు, యుద్ధ నౌకల నుంచి భారీ రాకెట్‌ దాడులు కొనసాగుతున్నాయి. హమాస్‌ నిర్మించుకున్న భూగర్భ సొరంగాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురుస్తోంది. గాజాలో భూతల దాడులను మరింత తీవ్రంచేస్తామని ప్రకటించింది. ఇ‍జ్రాయెల్‌ దాడిలో ఇప్పటికే వేల సంఖ్యలో పౌరులు మృతిచెందారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య రాజీ కుదుర్చేందుకు మధ్యప్రాశ్చ్య దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ఇరుపక్షాలు కాల్పులు విరమించాలని, బంధీలుగా ఉన్న పౌరులను విడిచిపెట్టాలా రాజీకుదిర్చేలా యత్నిస్తున్నాయి. దీనికి హమాస్‌ వైపు నుంచి సానుకూల ప్రకటన వెలువడింది. ఖైదీల మార్పిడికి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్‌ ప్రకటించింది. ప్రతిగా బంధీలుగా ఉన్న పాలస్తీనియన్లను విడిచిపెట్టాలని షరతు విధించింది. తమ వద్ద బంధీలుగా ఉన్న ఇజ్రాయెలీలను విడిచిపెడతామని ఎజ్జెడిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ప్రతినిధి అబు ఒబెయిడా చెప్పారు. దీనికి బదులుగా ఇజ్రాయెల్‌ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలందరినీ విడుదల చేయాలన్నారు. అలా అయితే తక్షణమే ఖైదీల మార్పిడి ఒప్పందానికి సిద్ధమేనని స్పష్టం చేశారు.

 తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను విడిచిపెడతామని ఎజ్జెడిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ప్రతినిధి అబు ఒబెయిడా చెప్పారు. దీనికి బదులుగా ఇజ్రాయెల్‌ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలందరినీ విడుదల చేయాలి. అలా అయితే తక్షణమే ఖైదీల మార్పిడి ఒప్పందానికి సిద్ధమేనని స్పష్టం చేశారు.


Tags:    

Similar News