గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. విదేశీయులతో సహా 13 మంది బందీలు మృతి
మారణహోమం ముగిసేదెన్నడో.. పగలు, ప్రతీకారాలతో రగులుతున్న దేశాలు యుద్దం పేరుతో వేలాది మంది మృతికి కారణమవుతున్నారు. ముక్కు పచ్చలారని చిన్నారులు సైతం సమిధలవుతున్నారు ఈ యుద్ధంలో.;
మారణహోమం ముగిసేదెన్నడో.. పగలు, ప్రతీకారాలతో రగులుతున్న దేశాలు యుద్దం పేరుతో వేలాది మంది మృతికి కారణమవుతున్నారు. ముక్కు పచ్చలారని చిన్నారులు సైతం సమిధలవుతున్నారు ఈ యుద్ధంలో. అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్ మరియు గాజాలో 2,800 మందికి పైగా మరణించారు.
ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్‌పై మరిన్ని వైమానిక దాడులతో బాంబు దాడి చేసింది. దీంతో ఇళ్లు నేలమట్టం అవుతున్నాయి. వీధుల్లో రక్తమోడుతున్న శరీరాలు.. గుట్టలుగా పడి ఉన్న శవాలు. యుద్దం భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో దెబ్బతిన్న భవనాల శిథిలాలను పాలస్తీనియన్లు పరిశీలిస్తున్నారు.
హమాస్ దాదాపు 150 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసే వరకు గాజా స్ట్రిప్‌లో విద్యుత్, నీరు, ఇంధనంతో సహా ప్రాథమిక వనరులను దేశం అనుమతించదని ఇజ్రాయెల్ ఇంధన మంత్రి తెలిపారు. ఈజిప్టు ద్వారా సరఫరాల ప్రవేశాన్ని ఇజ్రాయెల్ అడ్డుకోవడంతో సంక్షోభం మరింత తీవ్రమవుతోందని పలు అంతర్జాతీయ సహాయ బృందాలు తెలిపాయి.
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ గురువారం టెల్ అవీవ్‌ను సందర్శించి, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా నుండి నిరంతర మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. బ్లింకెన్ ఇలా అన్నాడు, “మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీకు స్వంతంగా బలంగా ఉండవచ్చు. అయినా అమెరికా ఎప్పుడూ మీకు అండగానే ఉంటుంది అని తెలిపారు. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో విదేశీయులతో సహా 13 మంది బందీలు మరణించారని హమాస్ తెలిపింది.