Israel : ఇజ్రాయెల్ లో రోడ్డుపై చెల్లాచెదురుగా మృతదేహాలు
గాజాలో విధ్వంసం... వందల సంఖ్యలో మృతదేహాలు;
హమాస్ దాడి తర్వాత, ఇజ్రాయెల్ కూడా గాజా ప్రాంతంపై అనేక వైమానిక దాడులు చేసింది. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో గాజాలో నివసించే వారిలో 230 మందికిపైగా మృతి చెందారు. 1000 కంటే ఎక్కువ మంది గాయాల పాలయ్యారు. గాజా స్ట్రిప్‌లోని ఏడు వేర్వేరు ప్రాంతాల్లోని ప్రజలను తమ ఇళ్లు విడిచిపెట్టి సిటీ సెంటర్ లేదా షెల్టర్ హోమ్‌లకు వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం కోరింది.
హమాస్ ముష్కరుల ఆకస్మిక దాడులతో ఇజ్రాయెల్ దేశంలోని స్డెరోట్ పట్టణంలోని రోడ్లపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. హమాస్ దాడి అనంతరం 12 గంటల తర్వాత దక్షిణ ఇజ్రాయెల్ పట్టణం స్డెరోట్‌లో పలు మృతదేహాలు, బుల్లెట్ రంధ్రాలున్న వాహనాలను తాను చూసినట్లు ఇజ్రాయెలీ వ్యక్తి వెల్లడించారు. ఆదివారం సెలవు దినం కావడంతో తాను ఇంట్లో నిద్రిస్తుండగా ఆరు గంటలకు సైరన్, పేలుళ్లు వినిపించాయని ఇంటర్నెట్ లో ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని తెలుసుకొని బయటకు వెళ్లానని చెప్పారు. స్డెరోట్ పట్టణ రోడ్డుపై మృతదేహాల చెల్లాచెదురుగా పడి ఉండటం చూశానన్నారు.
ఇజ్రాయెల్ గ్రామాల్లోకి ప్రవేశించిన ముష్కరులు ప్రజలను చంపి, బందీలను గాజాకు తీసుకువెళ్లారు. ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు స్డెరోట్‌లోని ఒక రహదారిపై పడి ఉన్నాయి. గాజాకు విద్యుత్, ఇంధనం, ఇతర వస్తువుల సరఫరా మార్గాలను నిలిపివేస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం నుంచి ఈ ప్రకటన వచ్చినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్ అధికారులు శనివారం ఇక్కడ విద్యుత్‌ను నిలిపివేశారు.దీంతో శనివారం నుంచి ఇక్కడ అంధకారం నెలకొంది.
స్డెరోట్ పట్టణం గాజా నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. గతంలో పాలస్తీనా షెల్లింగ్ దాడుల భారాన్ని స్డెరోట్ పట్టణం భరించింది. గాజాలో ప్రారంభమైన దాడి వెస్ట్ బ్యాంక్, జెరూసలేంకు వ్యాపిస్తుందని హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే చెప్పారు.