Israel-Hamas: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి..మేయర్ సహా 15మంది మృతి
హిజ్బుల్లా డ్రోన్ దాడిలో 60 మందికి పైగా క్షతగాత్రులు..;
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రమయ్యాయి. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడుల్లో ఖనా నగర మేయర్ అహ్మద్ కహిల్ మరణించినట్లుగా నబాతియే ప్రావిన్స్ గవర్నర్ హువైదా టర్క్ వెల్లడించారు.ఈ దాడుల్లో ఖనా మేయర్‌తో సహా 15మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.
పౌరుల ఇళ్ల మధ్య ఉన్న హెజ్‌బొల్లా తీవ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ మంగళవారం అర్ధరాత్రి భీకర దాడులు చేసింది.ఈ దాడుల్లో మేయర్ సహా పలువురు మృతి చెందారు.దాడిలో ధ్వంసమైన భవనాల శిథిలాల నుంచి 15 మృతదేహాలను వెలికి తీశామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
దక్షిణ లెబనాన్‌లోని ఖనా నగరంపై మంగళవారం అర్థరాత్రి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మేయర్ అహ్మద్ కహిల్ మరణించినట్లుగా నబాతియే ప్రావిన్స్ గవర్నర్ హువైదా టర్క్ ప్రకటించారు. ఈ దాడుల్లో మేయర్‌తో సహా 15మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. ‘‘పౌరుల నివాస స్థలాల మధ్య ఉన్న హెజ్‌బొల్లా మిలిటెంట్ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంతో మేయర్ సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. దాడిలో కూలిన భవనాల శిథిలాల నుంచి 15 మృతదేహాలను వెలికి తీశాం. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి’’ అని లెబనాన్ సివిల్ డిఫెన్స్ పేర్కొంది.
ఆదివారం దక్షిణ లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాల(యూనిఫిల్)పై ఇజ్రాయెల్ సైన్యం(ఐడీఎఫ్) చేసిన దాడుల్లో 15 మంది ఐరాస సైనికులు గాయపడ్డారు. ప్రమాదకర ప్రాంతాల నుంచి, హెజ్‌బొల్లాకు పట్టున్న ప్రాంతాల నుంచి తక్షణమే ఐరాస దళాలు వైదొలగాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు డిమాండ్ చేశారు. దక్షిణ లెబనాన్‌పై భూతల దాడులు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 250 మందికి పైగా హెజ్‌బొల్లా ఫైటర్లు మరణించినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. వీరిలో 21 మంది కమాండర్లు ఉన్నట్లు తెలిపింది. మొత్తంగా హెజ్‌బొల్లాకు సంబంధించి సైనిక సామర్థ్యాలను భారీగా దెబ్బతీశామని.. అయినప్పటికీ ఇజ్రాయెల్‌పై దాడి చేసే సామర్థ్యాలు వారివద్ద ఉన్నట్లు చెప్పింది.
కాగా ఇజ్రాయెల్‌లోని బిన్యామినా ప్రాంతంలోని సైనిక స్థావరమే లక్ష్యంగా ఇటీవల హెజ్‌బొల్లా భీకర డ్రోన్ దాడి చేసింది. ఆ దాడుల్లో నలుగురు ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. 60 మందికిపైగా గాయపడ్డారు. లెబనాన్‌లో ఐడీఎఫ్ గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత హెజ్‌బొల్లా చేసిన అతిపెద్ద దాడి ఇది.