Israel: నెతన్యాహుకు "సుప్రీంకోర్టు షాక్"
న్యాయ సంస్కరణల చట్టంపై విచారణ షురూ... ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం...;
ఇజ్రాయెల్ (Israel) రాజకీయాల్లో కీలక పరిణామం సంభవించింది. ప్రధాని బెంజిమన్ నెతన్యాహును పదవి నుంచి తొలగించకుండా రక్షణ కల్పించే చట్టానికి(plea against law shielding Netanyahu) వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం(Israel's top court) విచారణ చేపట్టింది. దేశ సుప్రీంకోర్టు అధికారాలను నియంత్రిస్తూ( judicial overhaul) న్యాయ సంస్కరణలంటూ ఇజ్రాయెల్ ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిపై ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ ఆమోదించిన ఈ చట్టంపై కోర్టు విచారణ చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రధాని బెంజిమన్ నెతన్యాహు(Netanyahu) తీసుకొచ్చిన ఈ న్యాయ సంస్కరణల చట్టం ప్రతిపక్షాల్లో, దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు కారణమైంది. అంతర్జాతీయంగా అమెరికా వంటి దేశాలు కూడా దీనిని తప్పుపట్టాయి. మొత్తం 124 మంది సభ్యులున్న పార్లమెంటులో 64 మంది దీనికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు ఎగిసిపడ్డాయి. తీవ్రమయ్యే అవకాశం ఉంది.
పార్లమెంట్, మంత్రులు, ఇతర ఎన్నికైన సభ్యుల నిర్ణయాలు అహేతుకంగా ఉన్నాయనే పేరిట ఇక నుంచి సుప్రీం కోర్టు కొట్టేయడానికి అవకాశం లేదు. ఇది ప్రజాస్వామ్యానికి ముగింపు కాదని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమని ప్రధాని నెతన్యాహు అన్నారు.
న్యాయవ్యవస్థను సంస్కరిస్తామనే హామీతో తమ కూటిమి అధికారంలోకి వచ్చిందని నెతన్యాహు, ఆయన సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాములు మొదటి నుంచి చెబుతూ వచ్చారు. వామపక్ష భావజాలం గల జడ్జీలతో న్యాయవ్యవస్థ నిండిపోయిందని వారు ఆరోపిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ నిర్ణయాలను తిరస్కరించే హక్కు.. ప్రజలు ఎన్నుకోని న్యాయమూర్తులకు ఉండదని నెతన్యాహు వర్గం వాదిస్తోంది. సుప్రీంకోర్టుతోపాటు దేశంలోని ఇతర కోర్టులకు జడ్జీలను నియమించే అధికారం ప్రభుత్వానికే ఉండాలంటున్నారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాధినేతలూ ఇజ్రాయెల్ న్యాయవ్యవస్థ ప్రక్షాళనపై ఆందోళన వ్యక్తం చేశారు. మీరు వెళుతున్న దారి సరైనది కాదంటూ గతంలో నెతన్యాహును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు .