Japan: జపాన్‌లో ‘ట్విటర్ కిల్లర్’ ఉరి
సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని.. ఆపై అతికిరాతంగా హత్యాచారం;
జపాన్‌లో సుమారు మూడేళ్ల తర్వాత మరణశిక్ష అమలు చేశారు. ‘ట్విటర్ కిల్లర్’గా పేరున్న తకహిరో షిరాయిషి ని శుక్రవారం ఉరి తీసినట్లు ఆ దేశ న్యాయశాఖ అధికారికంగా ప్రకటించింది. సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని.. ఆపై అతికిరాతంగా హత్యాచారం చేయడంతో ఇతనికి ఆ పేరు ముద్రపడింది. సంచలనం సృష్టించిన ఈ సీరియల్ కిల్లర్ ఉదంతంతో.. షాకింగ్ విషయాలే వెలుగు చూశాయి అప్పట్లో..
సామాజిక వేదిక ట్విట్టర్‌లో పరిచయమైన బాలికలను, మహిళలకు నమ్మించి.. మాయమాటలు చెప్పి తకహిరో షిరాయిషి తన అపార్టుమెంట్‌కు రప్పించుకుని లైంగికదాడికి పాల్పడేవాడు. ఆపై డబ్బు, ఇతర విలువైన వస్తువులు లాక్కుని.. అనంతరం చంపేసి వారి తల, మొండెం, కాళ్లు, చేతులు.. శరీర భాగాలన్నీ ముక్కలుగా నరికిపడేసేవాడు.
2020లో ఈ సీరియల్ కిల్లర్‌కు టోక్యో కోర్టు మరణశిక్ష విధించింది. తకహిరో షిరాయిషి.. ట్విట్టర్‌లో ఆత్మహత్యకు సంబంధించిన పోస్టులు పెట్టే యువతనే టార్గెట్‌గా చేసుకునేవాడు. బాధను తనతో పంచుకోమంటూ మాటల కలిపి.. స్నేహం చేసేవాడు. అనంతరం ఇద్దరం కలిసి చనిపోదామంటూ నమ్మకం కలిగించేవాడు. ఆ తరువాత తన ఇంటికి రప్పించి వారిని హతమార్చేవాడు. ఇలా ఏకంగా తొమ్మిది మందిని హత్య చేశాడు. వారిలో 26 ఏళ్ల లోపు ఎనిమిది మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.
అసలు ఎలా చేసాడంటే:
తకహిరో షిరాయిషి 1990లో జపాన్‌లో జన్మించాడు. అతను "ట్విటర్ కిల్లర్"గా ప్రసిద్ధి చెందాడు. ఎందుకంటే అతను ట్విటర్ వేదికగా ఆత్మహత్య ఆలోచనలు ఉన్న వ్యక్తులను టార్గెట్ చేసి, వారిని తన అపార్ట్‌మెంట్‌కు రప్పించి హత్య చేశాడు.
మోడ్ ఆఫ్ ఆపరేషన్
2017 ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య, అతను 15–26 ఏళ్ల వయసున్న 8 మంది యువతులు, ఒక యువకుడిని హతమార్చాడు
బాధితులను మాయ చేసి, "ఆత్మహత్యలో సహాయం చేస్తానని" చెప్పి తన ఇంటికి రప్పించేవాడు
హత్య చేసిన తర్వాత, శరీర భాగాలను ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లలో దాచేవాడు
అతని అపార్ట్‌మెంట్‌లో 9 తలలు, చేతులు, కాళ్ల ఎముకలు లభించాయి
న్యాయ విచారణ & శిక్ష
2020లో కోర్టు అతనికి మరణదండన విధించింది
అతను మొదట హత్య చేశానని చెప్పినా, తర్వాత ఆ వాదనను తిరస్కరించాడు
2025 జూన్ 27న జపాన్‌లో అతనికి ఉరిశిక్ష అమలు చేశారు
సామాజిక ప్రభావం
ఈ కేసు జపాన్‌ను తీవ్రంగా కుదిపేసింది. సోషల్ మీడియా వేదికలపై భద్రత, ఆత్మహత్యలపై చర్చలు ముమ్మరమయ్యాయి. జపాన్‌లో విధిస్తున్న మరణశిక్షలను రద్దు చేయాలని అక్కడి ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టడంతో మూడేళ్లుగా ఉరిశిక్షలు విధించడాన్ని అక్కడి అధికారులు నిలిపివేశారు. మూడేళ్ల తర్వాత శుక్రవారం టోక్యో డిటెన్షన్ హౌస్‌లో షిరైషిని ఉరితీసినట్లు అధికారులు వెల్లడించారు. అతడి ఉరిశిక్ష అమలుచేసేవరకు ఈ విషయాన్ని బయటకు వెల్లడించలేదని తెలిపారు.