Moon Mission: అన్నీ బాగుంటే ఈ రోజే జాబిలి పైకి జపాన్ నౌక

ఇవాళ రాత్రే సాఫ్ట్ ల్యాండింగ్!;

Update: 2024-01-19 08:45 GMT

భారతదేశం ప్రయోగించిన చంద్రయాన్ 3 సక్సెస్‌ఫుల్‌గా జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ కావడంతో ప్రపంచ దేశాలు చంద్రుడి గుట్టు తెలుసుకునేందుకు ఇతర దేశాలన్నీ చంద్రుడిపై కాలు పెట్టేందుకు ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గతేడాది జపాన్ ప్రయోగించిన ప్రయోగం.. చంద్రుడి ఉపరితలాన్ని తాకేందుకు మరో అడుగు దూరంలో ఉంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8.50 గంటలకు జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ జరగనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళే చంద్రుడిపై ల్యాండర్‌ను దించాలని భావిస్తున్న జపాన్.. ఇది కుదరకపోతే మాత్రం  మరో నెల రోజుల తర్వాత దించేందుకు ఏర్పాట్లు చేసింది.

జాక్సా టనేగషిమా స్పేస్‌ సెంటర్‌లోని యోషినోబు లాంచ్‌ కాంప్లెక్స్‌ నుంచి జపాన్ ప్రయోగించిన స్లిమ్ పేరు స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్. 730 కిలోల బరువు ఉన్న ఈ వ్యోమనౌకను.. గతేడాది సెప్టెంబర్ 7 వ తేదీన జపాన్ ప్రయోగించింది. ఈ వ్యోమనౌక చంద్రుడిపై దిగితే ఆ ఘనత సాధించిన ఐదో దేశంగా జపాన్ నిలవనుంది. ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా, భారత్ దేశాలు చంద్రుడిపై సక్సెస్‌ఫుల్‌గా కాలుపెట్టగలిగాయి. స్లిమ్ మిషన్ కోసం జపాన్ అంతరిక్ష సంస్థ అయిన ఏరో స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్‌ ఏజెన్సీ ఒక లక్ష్యాన్ని నిర్దేశించింది. పేరులో ఉన్నట్లుగానే దూరపు లక్ష్యాలను గురి తప్పకుండా ఛేదించగలిగేదే ఈ మూన్ స్నైపర్. చంద్రుడిపై ముందుగా నిర్ణయించిన ప్రదేశానికి ఖచ్చితంగా 100 మీటర్ల లోపే ల్యాండర్ దిగాల్సి ఉంటుంది.ఈ ప్రయోగం సఫలమైతే జాబిల్లిపై ల్యాండర్‌ను సాఫ్ట్‌ ల్యాండ్‌ చేసిన ఐదో దేశంగా జపాన్‌ అవతరించనున్నది.   ప్రతికూల వాతావరణం కారణంగా జపాన్‌ మూన్‌ స్నిపర్‌ మిషన్‌ గతంలో  మూడుసార్లు వాయిదా పడినాల్గవసారి నింగీలోకి వెళ్ళింది.  

Tags:    

Similar News