Japan: ఇదేం ఆనందమో.. రూ.12 లక్షలు ఖర్చుపెట్టి శునకంలా మారిన మనిషి

Japan: జంతువులు ఇష్టమైతే పెంచుకుంటారు.. వాటిని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటారు. కానీ వాటిలా మారిపోవాలని ఎవరైనా అనుకుంటారా.. అదెలా సాధ్యం..

Update: 2022-05-26 07:22 GMT

Japan: జంతువులు ఇష్టమైతే పెంచుకుంటారు.. వాటిని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటారు. కానీ వాటిలా మారిపోవాలని ఎవరైనా అనుకుంటారా.. అదెలా సాధ్యం.. పైసామే పరమాత్మా హై.. డబ్బులుంటే అది కూడా సాధ్యమే అంటున్నారు జెప్పెట్ అనే ప్రొఫెషనల్ ఏజెన్సీ వారు.

జంతువులా కనిపించాలనేది అతడి కల. జపనీస్ వ్యక్తి తనను తాను "కోలీ" అనే కుక్క జాతిగా మార్చుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాడు. ఇది జెప్పెట్ అనే ప్రొఫెషనల్ ఏజెన్సీ ద్వారా సాధ్యమైంది.

ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో పంచుకోగా, వాటిని చూసి నెటిజన్లు ఆశ్చర్యచకితులవుతున్నారు.. శునకంలా మారడానికి అతడు భారీగానే ఖర్చు చేశాడు.. దాదాపు రూ.12 లక్షలు ఖర్చుపెట్టి, నిపుణులు 40 రోజులు కష్టపడి అతడి కోరికను నెరవేర్చారు.

జపాన్ కు చెందిన వార్తా సంస్థ న్యూస్.మైనవి ప్రకారం.. జెప్పెట్ అనే ఓ సంస్థ సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, వినోద సౌకర్యాల కోసం పెద్ద ఎత్తున శిల్పాలు, అద్భుత కళా ఖండాలు తయారు చేస్తుంది. ప్రసిద్ధ మస్కట్ పాత్రల దుస్తులను కూడా రూపొందిస్తుంది. కాగా టోకో ఇవీ అనే వ్యక్తి తాను పూర్తి శునకంలా కనిపించాలనే కోరికను ఆ సంస్థ ముందుంచాడు.. ఎంత ఖర్చైనా పర్లేదు.. తనను శునకంలా మార్చేయమని అడిగాడు..

సంస్థ కూడా సరేనని నిపుణులను నియమించింది.. కళాకారులు 40 రోజులు కష్టపడి అతడికి మేకోవర్ చేసారు.. మొత్తానికి టోకో ఇవీ.. కోలీ జాతి శునకంలా మారిపోయాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇవి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. మరి ఎన్ని రోజులు శునకంలా ఉంటాడో తెలియజేయలేదు.

Tags:    

Similar News