Hawaii volcano: హవాయిలో అగ్నిపర్వతం విస్ఫోటనం..

165 అడుగుల వరకు ఎగసిపడుతున్న లావా!

Update: 2025-03-05 03:00 GMT

అమెరికాలోని హవాయి అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో 100 అడుగులకు పైగా లావా ఎగసిపడుతుంది. హవాయి అగ్నిపర్వత ప్రాంతంలో ఉన్న ప్రపంచంలోని అత్యంత చురుకైన కిలోవియా శిఖరంపై బిలం నుంచి గతేడాది డిసెంబర్‌ 23న విస్ఫోటం మొదలైనట్లు అధికారులు తెలిపారు. క్రమంగా ఆ విస్ఫోటం పెద్ద ఫౌంటెయిన్‌లా మారి మంగళవారం ఆ అగ్నిపర్వతం నుంచి ఒక్కసారిగా 100 అడుగుల ఎత్తుకు లావా ఎగసిపడిందని హవాయి అగ్నిపర్వత అబ్జర్వేటరీ పేర్కొంది.

ప్రస్తుతం లావా 150 నుంచి 165 అడుగుల వరకు ఎగసిపడుతోందని.. మరింత ఎత్తుకు చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పర్వతం ఎత్తైన ప్రాంతంలో ఉన్నందువల్ల స్థానిక నివాసితులకు ఎటువంటి ముప్పు లేదని అన్నారు. అగ్నిపర్వతం వద్ద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. పర్వత ప్రాంత సమీపంలోకి ప్రజలు ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించారు.

Tags:    

Similar News