Chile Forest Fires: చిలీలో కార్చిచ్చు..

46 మంది మృతి

Update: 2024-02-04 01:00 GMT

చిలీలో ఉష్ణోగత్రలు పెరగడంతో కార్చిచ్చు వీరవిహారం చేస్తోంది. కార్చిచ్చులో ఇప్పటివరకు 46 మంది సజీవదహనంకాగా వేలాది మంది గాయపడినట్టు ఆ దేశపు అధ్యక్షుడు బోరిక్ గాబ్రియెల్ తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో వంది మంది పైగా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న ప్రకృతి సహకరించడంలేదని అగ్నిమాపక అధికారులు వివరించారు. వాల్పరైజో ప్రాంతంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతుండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించారు. ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 1100 ఇళ్లు కార్చిచ్చులో కాలి బూడిదలాగా మారాయని పేర్కొన్నారు. బలమైన గాలులు వీయడంతో ఉష్ణోగ్రతలు పెరగడంతో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తుందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. చిలీలో 92 ప్రాంతాలలో కార్చిచ్చు చెలరేగిందని మంత్రి కరోలినా వెల్లడించారు.


వేగంగా విస్తరిస్తున్న మంటలను అదుపు చేసేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదని అన్నారు. అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు, స్వల్ప తేమ.. పరిస్థితులను మరింత దయనీయంగా మారుస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మధ్య, దక్షిణ ప్రాంతాల్లో దాదాపు 92 కార్చిచ్చులు చెలరేగినట్లు చిలీ అంతర్గత వ్యవహారాల మంత్రి కరోలినా తొహా వెల్లడించారు. తీవ్రత అధికంగా ఉన్న వాల్పరైజో ప్రాంతం నుంచి వేలాది మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించామని, వారంతా పునరావాస కేంద్రాల్లో తలదాంచుకుంటున్నారని తెలిపారు.

గత దశాబ్ద కాలంలో దేశంలో చెలరేగిన కార్చిచ్చుల్లో అత్యంత దారుణమైనది ఇదేనని చిలీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తెలిపింది. ఇక, చిలీలో కార్చిచ్చు సర్వసాధారణం. గతేడాది అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా 4 లక్షల హెక్టార్ల మేర అడవులు దగ్దమయ్యాయి. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాదితో పోల్చితే ఇది తక్కువ విస్తీర్ణమైనా.. ప్రాణనష్టం అధికంగా ఉంది. 

శుక్రవారం నుంచి ఇప్పటి వరకు దాదాపు కార్చిచ్చు వల్ల 1,100 ఇళ్లు అగ్నికి ఆహుతైనట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. పర్యాటక ప్రాంతాలైన వినా డెల్‌మార్‌, వాల్పరైజో ప్రాంతాల్లో మంటల తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలిపింది. దట్టమైన పొగ వ్యాపించడం వల్ల ఆయా ప్రాంతాల్లోని పర్యాటకులు, స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు వేడి గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని నేషనల్ ఫారెస్ట్రీ కార్పొరేషన్ హెచ్చరించడంతో ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తమైంది. 

Tags:    

Similar News