Melinda Gates: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ వల్లే బిల్‌గేట్స్‌తో విడిపోయా : మిలిందా

అమెరికాతో పాటు ప్రపంచాన్ని కుదిపేస్తోన్న ఎప్‌స్టీన్ ఫైల్స్

Update: 2026-02-04 08:00 GMT

ఎప్‌స్టీన్ సెక్స్ స్కామ్ ఫైల్స్ అమెరికాతో పాటు యావత్తు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఈ స్కామ్‌లో అనేక మంది వీఐపీల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా ఫొటోలు బయటకు వచ్చాయి. అమెరికా న్యాయశాఖ ఈ ఎప్‌స్టీన్ ఫైల్ విడుదల చేసింది.

తాజాగా ఇదే వ్యవహారంపై మైక్రోసాఫ్ట్‌ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ మాజీ భార్య మిలిందా ఫ్రెంచ్ గ్రేట్స్ స్పందించింది. ఎన్‌పీఆర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. హోస్ట్ రాచెల్ మార్టిన్ అడిగిన ప్రశ్నలకు మిలిందా సమాధానం ఇచ్చారు. ‘‘ఎప్‌స్టీన్ ఫైల్ నా వివాహ జీవితంలో చాలా బాధాకరమైన సమయాలను, జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది’’. అని అన్నారు. ఏ అమ్మాయి కూడా ఎప్‌స్టీన్ లాంటి వ్యక్తుల చేతుల్లో చిక్కుకూడదన్నారు. ఎప్‌స్టీన్ ఫైల్‌పై తాను కాకుండా.. సంబంధం ఉన్న వ్యక్తులే సమాధానం ఇచ్చుకోవాలని హితవు పలికారు. ఎప్‌స్టీన్ ఫైల్‌ ఆరోపణలపై నా మాజీ భర్తే సమాధానం ఇచ్చుకోవాలి.. అది నా కోసం కాదు.’’ అని చెప్పుకొచ్చారు.

‘‘నా బాధను నేను భరించగలను. ఆ యువతులను చూసి నా దేవా వారు ఎలా ఉన్నారు. ఆ అమ్మాయిలకు అది ఎలా జరిగింది?, కాబట్టి నాకు అది విచారం. అందు కోసమే నా వివాహాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్ని చూసి తట్టుకోలేకే నా వివాహాన్ని రద్దు చేసుకున్నాను. కాబట్టి ఇది కేవలం విచారకరం. అదే నిజం.’’ అని మిలిందా వివరించారు. బిల్‌గేట్స్‌ ఇతర మహిళలతో సన్నిహితంగా ఉన్నట్లు తెలియడంతో తీవ్రమైన మానసిక క్షోభను అనుభవించానని.. ఆ కారణంగానే వైవాహిక జీవితానికి ముగింపు పలికినట్లు వెల్లడించారు. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో ఉన్న బాధిత ఉన్న మహిళలకు న్యాయం లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు.

బిల్‌గేట్స్ దంపతులు 2021లో విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు 20 ఏళ్లు పైబడిన ముగ్గురు పిల్లలున్నారు. ప్రస్తుతం మిలిందాకు 61 ఏళ్లు. పిల్లలతోనే ఉంటున్నారు.


Tags:    

Similar News