ఎక్కువ మంది పిల్లలను కంటే ఆదాయపు పన్నునుంచి మినహాయింపు: హంగేరీ

వలసల రేటును అరికట్టడంతో పాటు, వివాహాలు మరియు కుటుంబాలను ప్రోత్సహించే లక్ష్యంతో అనేక చర్యలను ప్రకటించింది హంగేరీ ప్రభుత్వం.;

Update: 2024-06-22 05:38 GMT

ఆదాయపు పన్నులు చెల్లించడం తరచుగా సగటు వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుంది. అయితే జీవితాంతం పన్నుల నుండి మిమ్మల్ని మినహాయించే చర్యలను ప్రభుత్వం ప్రవేశపెడితే మద్యతరగతి వాసికి అంతకంటే కావలసింది ఏం ఉంటుంది. వివాహాలు మరియు కుటుంబాలను ప్రోత్సహించడం మరియు వలసల రేటును అరికట్టడం లక్ష్యంగా హంగేరీ ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్ శుక్రవారం అనేక చర్యలను ప్రకటించారు. "మరింత మంది పిల్లలను కనండి అంటూ కుటుంబాలను ప్రోత్సహించారు.

అనేక ఇతర ఐరోపా దేశాల మాదిరిగానే హంగేరీ, తగ్గుతున్న జననాల రేటు కారణంగా సవాలును ఎదుర్కొంటోంది. జనాభా క్షీణతను తిప్పికొట్టడానికి, జనన రేటును పెంచడానికి హంగేరి కొన్ని చర్యలను ప్రకటించింది. విక్టర్ ఓర్బన్ మాట్లాడుతూ, "ఐరోపాలో తక్కువ మంది పిల్లలు జన్మిస్తున్నారు. దాంతో జనాభా శాతం తగ్గుతోంది. కనీసం నలుగురు పిల్లలను కనే మహిళలకు వారి జీవితకాలం వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లించకుండా మినహాయించాయి. పెద్ద కుటుంబాలకు పెద్ద కార్లను కొనుగోలు చేసేందుకు సబ్సిడీని కూడా ప్రకటించింది. జనాభాను తిప్పికొట్టే కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా 21,000 క్రెచ్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది

దేశానికి ఎక్కువ మంది హంగేరియన్ పిల్లలు అవసరమని విక్టర్ ఓర్బన్ అన్నారు. “మాకు సంఖ్యలు అవసరం లేదు. ఎంత ఎక్కువ మంది ఉంటే అంత మంచింది. మాకు హంగేరియన్ పిల్లలు కావాలి, ”అని అతను చెప్పాడు.

"మిశ్రమ జనాభా దేశాలను" విమర్శిస్తూ, విక్టర్ ఓర్బన్.. క్రైస్తవ దేశాలు త్వరలో క్రైస్తవులు మైనారిటీలుగా ఉన్న దేశాలుగా మారుతాయని "రిటర్న్ టిక్కెట్" లేదని ఆయన అన్నారు.

కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి ఉత్తర్వు ఒకటి జారీ చేయబడింది. సబ్సిడీ రుణాలతో వివాహం మరియు ప్రసవాన్ని ప్రోత్సహించే పథకం కూడా వివాహాలలో విజృంభణకు సహాయపడింది. 2019లో, ఒక కొత్త పథకం వధువు 41వ పుట్టినరోజు కంటే ముందు వివాహం చేసుకునే జంటలకు 10 మిలియన్ ఫోరింట్ల ($33,000) వరకు సబ్సిడీ రుణాలను అందించింది. వారు ఇద్దరు పిల్లలను కలిగి ఉంటే రుణంలో మూడవ వంతు మాఫీ చేయబడుతుంది,  ముగ్గురు ఉంటే మొత్తం రుణం తుడిచిపెట్టబడుతుంది అని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది.

Tags:    

Similar News