EARTHQUAKE: వణికిపోయిన బ్యాంకాక్, మయన్మార్
భారీ భూకంపం.. 15 మంది మృతి... నిర్మానుష్యంగా మారుతున్న బ్యాంకాక్;
భారీ భూప్రకంపనలతో బ్యాంకాక్, మయన్మార్ వణికిపోయాయి. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో ప్రకంపనలు రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. థాయ్‌లాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలో థాయ్‌లాండ్ ప్రధాని షినవత్ర అత్యవసర పరిస్థితి ప్రకటించారు. భూకంపం ధాటికి అక్కడి పలు భవనాలు పేకమేడల్లా కూలాయి. మరోవైపు భారత్‌లోని పలు ప్రాంతాల్లో మయన్మార్ భూకంప ప్రభావం పడింది. కోల్‌కతా, ఇంఫాల్, మేఘాలయాలోనూ స్పల్ప ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి సహా చర్యలు చేపట్టారు. మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపంలో 15 మంది మృతి చెందగా.. 43 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు బ్యాంకాక్‌లో రైల్వే, మెట్రో సేవలు నిలిపివేశారు. థాయ్‌లాండ్‌లోనూ పలు బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో థాయ్‌లాండ్ ప్రధాని దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
ఈ దేశాల్లోనూ భూకంపం
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భూకంపం సంభవించింది. మయన్మార్‌లో రెండు సార్లు భూప్రకంపనలు సంభవించగా భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇదే సమయంలో భారత్, చైనా, థాయ్‌లాండ్, బ్యాంకాక్, బంగ్లాదేశ్, లావోస్ దేశాల్లోనూ భూమి కంపించింది. అధికారులు అప్రమత్తమై భవనాల నుంచి జనాలను ఖాళీ చేయిస్తున్నారు.
మయన్మార్‌లో భారీ భూకంపం
మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూప్రకంపనల వల్ల పలు భవనాలు కుప్ప కూలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రాణనష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు బ్యాంకాక్‌లోనూ భూమి కంపించింది.
నిర్మానుష్యంగా మారుతున్న బ్యాంకాక్
బ్యాంకాక్ ను భారీ భూకంపం వణికించింది. బ్యాంకాక్ లో రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో నమోదైన భూకంపం విధ్వంసం సృష్టించింది. ఈ భూకంపం ధాటికి పలు భవనాలు బీటలు వారాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ భవనాల నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. వేలాదిమంది బ్యాంకాక్ ను వదిలి వేరే ప్రాంతానికి తరలివెళ్తున్నారు. దీంతో బ్యాంకాక్ నిర్మానుష్యంగా మారిపోతోంది.