Containers: ముంబై తీరానికి కొట్టుకొచ్చిన అనుమానాస్పద కంటైనర్లు

తీర ప్రాంత ప్రజలను అలెర్ట్ చేసి.. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అధికారులు

Update: 2025-09-08 07:00 GMT

ముంబైలోని సముద్ర తీరంలో అనుమానాస్పదంగా మూడు కంటైనర్లు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు .. వాటిపైఎంక్వైరీ ప్రారంభించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పాల్ఘర జిల్లా సత్పతి, షిర్గావ్ బీచ్ ల్లో అనుమానం కలిగించే విధంగా మూడు కంటైనర్లు సముద్రంలో కొట్టుకుని వచ్చాయి. దీంతో కోస్టు గార్డ్ సిబ్బంది అక్కడి చేరుకున్నారు. అనంతరం అవి ఎక్కడి నుంచి వచ్చాయో.. ఎలా వచ్చాయో.. అందులో ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో తీర ప్రాంత ప్రజలను అలెర్ట్ చేసి.. పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

సముద్రంలో అధిక ఆటుపోట్లు ఉండడంతో ప్రస్తుతం కంటైనర్లను తెరవడం కష్టంగా మారిందని.. ఓ కంటైనర్ పాక్షికంగా మునిగిందని అధికారులు వెల్లడించారు. అగస్టు నెలలో ఓ కార్గో షిప్ నుంచి దాదాపు 48 కంటెయినర్లు సముద్రంలో జారి పడ్డాయని.. ప్రస్తుతం అవే ఇక్కడి వరకు కొట్టుకుని వచ్చి ఉంటాయని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. సముద్ర తీర ప్రాంతంలో అనుమానాస్పద వస్తువులు, కంటైనర్లు కనిపిస్తే వాటిని ముట్టుకోవద్దని.. మత్స్యకారులు, తీర ప్రాంతాల్లోని గ్రామస్థులకు సూచించారు.

Tags:    

Similar News