Kim Jong-un: ఉత్తర కొరియా నియంతకు అనారోగ్య సమస్యలు.. వేధిస్తున్న ఒంటరితనం

Kim Jong-un: దేశ ప్రజలను తన చేతలతో, మాటలతో గడగడలాడించే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.

Update: 2023-01-18 06:32 GMT

Kim Jong-un: దేశ ప్రజలను తన చేతలతో, మాటలతో గడగడలాడించే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. సియోల్‌కు చెందిన ఉత్తర కొరియా విద్యావేత్త డాక్టర్ చోయ్ జిన్‌వూక్ మాట్లాడుతూ, నాయకుడు 40 ఏళ్లకు చేరుకోవడంతో తన వ్యక్తిగత ఆరోగ్యం మరియు భద్రతపై తాజా ఆందోళనలను ఎదుర్కొంటున్నాడు.




అనారోగ్యకరమైన జీవనశైలిని గడుపుతున్నాడు. తరచూ ప్రజల మధ్య గడిపే కిమ్ ఈ మధ్య చాలా కాలం నుంచి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఒత్తిడి నుంచి బయటపడేందుకు మద్యపానాన్ని అలవాటు చేసుకున్నారు అని డాక్టర్ జిన్‌వూక్ టెలిగ్రాఫ్‌ ద్వారా వివరించారు.



నివేదిక ప్రకారం, కిమ్ అధిక బరువు కలిగి ఉన్నాడు. కిమ్ వ్యక్తిగత వైద్యులు, భార్య తరచుగా వ్యాయామం చేయమని చెబుతున్నప్పటికీ వారి విజ్ఞప్తులను విస్మరిస్తున్నాడు. కిమ్ తన ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతున్నాడు.



కిమ్ తండ్రి, కిమ్ జోంగ్ ఇల్, 2011లో 69 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించారు. అతడి ఆందోళనకు అది కూడా ఓ కారణం కావచ్చని అంటున్నారు. కిమ్ జోంగ్ ఇల్ 2008లో స్ట్రోక్‌తో బాధపడ్డాడు. అతడికి కూడా దూమపానం, మద్యపానం అలవాట్లు ఉన్నాయి.

Tags:    

Similar News