F-16 fighter jets : ఉక్రెయిన్‌కు నార్వే ఎఫ్ 16 ఫైటర్స్

Update: 2023-08-25 05:27 GMT

రష్యా యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్ కు ప్రపంచ దేశాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు ఆర్థిక సాయం ప్రకటిస్తూ ఉండగా మరికొన్ని యుద్ధ విమానాలని అందిస్తున్నాయి. డెన్మార్క్, నెదర్లాండ్స్ నుంచి ఉక్రెయిన్‌కు ఎఫ్-16 ఫైటర్ జెట్‌లను డెలివరీ చేయడానికి అమెరికా ఆమోదించింది. 

యుద్ధపీడిత ఉక్రెయిన్‌కు నాటో సభ్య దేశం నార్వే నుంచి ఎఫ్ 16 యుద్ధ విమానాలు అందుతాయి. రష్యాపై పోరులో ఈ ఫైటర్స్ ఉపయోగపడుతాయని నార్వే మీడియా తెలిపింది. నార్వే ప్రధాని జోనాస్ గాహ్ ఇప్పుడు ఉక్రెయిన్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా జెలెన్స్కీని అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.  అయితే వీటి సరఫరా ఎప్పటి నుంచి ? ఎన్ని ఫైటర్స్‌ను పంపిస్తున్నారనేది నిర్థారణ కాలేదు. ఉక్రెయిన్‌కు ఇప్పటివరకూ నెదర్లాండ్స్, డెన్మార్క్‌ల నుంచి ఈ తరహా యుద్ధ విమానాలు అందాయి. ఇప్పుడు ఈ దిశలో ఉక్రెయిన్‌కు సాయం అందించే మూడో యూరోపియన్ దేశంగా నార్వే నిలుస్తుంది.


గత సంవత్సరం, నార్వేజియన్ వైమానిక దళం వద్ద ఉన్న 57  ,  F-16  ఫైటర్స్ విమానాలలో  32 విమానాలను NATO మిత్రదేశమైన రొమేనియాకు విక్రయించడానికి అంగీకరించింది. ఇంకా మిగిలిన  12 విమానాలు US వైమానిక దళానికి శిక్షణనిచ్చే ప్రైవేట్ కంపెనీకి విక్రయించాల్సి ఉంది, అయితే ఈ ఒప్పందం ఇంకా తుది ఆమోదం పొందలేదు కాబట్టే ఆ జెట్‌లు ఉక్రెయిన్‌కు విరాళంగా ఇవ్వడానికి సరిపోతాయని అభిప్రాయమ వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు అనుకున్నట్టుగానే  ఉక్రెయిన్‌కు  త్వరలో ఎఫ్-16 ఫైటర్ జెట్‌లు వచ్చే అవకాశం ఉందని యునైటెడ్ స్టేట్స్ టాప్ జనరల్ తెలిపారు. రష్యా దాడికి వ్యతిరేకంగా ప్రతి దాడులు చేసేందుకు ఎఫ్ -16 ఫైటర్ జెట్ లను పంపిస్తామని యూఎస్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ మార్క్ మిల్లీ చెప్పారు.


డెన్మార్క్, నెదర్లాండ్స్ దేశాల నుంచి ఎఫ్-16 లను రానున్నాయని యుక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడొమిర్ జెలెన్స్కీ చెప్పారు. ఎఫ్-16 ఫైటర్ జెట్‌లు ఉక్రెయిన్ దేశ వైమానిక రక్షణను బలోపేతం చేస్తామని, ఇవి రష్యా దళాలపై ఎదురుదాడికి సహాయపడతాయని ఆయన చెప్పారు. యుక్రేనియన్లకు గణనీయమైన పోరాట శక్తి ఉందని మిల్లీ చెప్పారు.  యుక్రెనియన్ సైనిక విజయం సాధించే అవకాశముందని మిల్లీ చెప్పారు. 

Similar News