Boat flipped Off : సముద్రంలో బోల్తా పడిన పడవ…63మంది మృతి

38 మందిని రక్షించిన కోస్ట్ గార్డ్;

Update: 2023-08-17 02:15 GMT

మరో పడవ ప్రమాదం భారీ సంఖ్యలో వలసదారులను పొట్టన పెట్టుకుంది. ఎంతోమందిని అడ్రస్ లేకుండా చేసింది. ఈ ఘటన పశ్చిమ ఆఫ్రికా తీరానికి దాదాపు 620 కిలో మీటర్ల దూరంలో ఉన్న కేప్ వర్డె దీవుల్లో చోటుచేసుకుంది. సముద్రంలో పడవ బోల్తా పడడంతో 63 మంది మరణించారు. ఈ దుర్ఘటనలో 38మంది శరణార్ధులు, వలసదారులను రక్షించారు. ఈ విషయాన్ని

ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) తెలిపింది. సెనెగల్‌ నుంచి బయలుదేరిన వలసదారుల పడవ కేప్‌ వెర్డే వద్ద బోల్తా పడిన ఘటనలో గినియా-బిస్సావు పౌరుడితో సహా 38 మందిని పడవ నుంచి రక్షించినట్లు సెనెగల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణించిన వారిలో 7 గురి మృతదేహాలు సముద్రంలో 7 లభించాయని కోస్ట్ గార్డ్ పేర్కొంది.56 మంది గల్లంతవ్వగా.. వారు కూడా మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.


ప్రాణాలతో బయటపడిన వారిలో కూడా ఏడుగురిని ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం ఉందని సాల్‌లోని ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. కేప్ వెర్డే స్పానిష్ కానరీ దీవుల సముద్ర మార్గంలో ఉంది. యూరోపియన్ యూనియన్‌కు గేట్‌వే. వేలాది మంది శరణార్థులు, వలసదారులు చేపలు పట్టే చిన్న పడవలలో ఇలా స్పెయిన్‌కు వెళ్తున్నట్లు సమాచారం.

ప్రతి సంవత్సరం ఈ ప్రమాదకరమైన ప్రయాణం చేస్తూ తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. జనవరిలో కేప్ వెర్డేలోని రెస్క్యూ బృందాలు 90 మంది శరణార్థులు, వలసదారులు కానోలో కొట్టుకుపోయారు.

Tags:    

Similar News