Taiwan: తైవాన్‌లో లక్షకుపైగా ఉడుముల హత్యకు నిర్ణయం

తైవాన్‌కు చుక్కలు చూపిస్తున్న ఇగ్వానాలు;

Update: 2025-01-24 00:45 GMT

వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న ఆకుపచ్చని ఉడుములను పెద్ద ఎత్తున వధించేందుకు తైవాన్‌ ప్రయత్నిస్తున్నది. ఈ ద్వీపంలోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో దాదాపు 2 లక్షల వరకు ఈ జీవులు ఉన్నట్లు అంచనా. సుమారు 1,20,000 ఉడుములను వధించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ ఉడుములు వ్యవసాయ పంటలపైనే ఆధారపడి జీవిస్తుంటాయని అటవీ పరిరక్షణ సంస్థ చెప్తున్నది.

సాధారణంగా ఎలుకలు పంట పొలాలను నాశనం చేస్తూ రైతులకు చుక్కలు చూపించడం గురించి మనకు తెలుసు. అలాగే కర్షకులు కూడా వాటిని చంపేందుకు పిల్లుల్ని పెంచడమో, విషం పెట్టడమో చేస్తుంటారు. ఇదంతా మనకు సర్వసాధారణమే. కానీ తైవాన్ రైతులను మాత్రం ఇగ్వానాలు అనే జీవులు ఇబ్బంది పెడుతున్నాయట. ఈక్రమంలోనే అక్కడి సర్కారు వాటిని చంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం లక్షా 20 వేల ఇగ్వానాలను హతమార్చేందుకు చర్యలు చేపట్టింది. అసలు ఇగ్వానాలు అంటే ఏంటి.. అసలు అవి పంటలను ఎలా నాశనం చేస్తున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

చూసేందుకు ఊసరవెల్లిలాగే కనిపించే ఇగ్వానాలు ఆకుపచ్చ రంగులో మాత్రమే ఉంటాయి. రెండు అడుగుల పొడవుతో ఐదు కిలోల బరువు ఉండే ఇవి.. 20 ఏళ్ల వరకు జీవిస్తాయి. అలాగే ఆడ ఇగ్వానా ఒకసారి 80 గుడ్లను పెడుతుంది. చాలా మంది తైవాన్ ప్రజలు వీటిని ఇంట్లో కూడా పెంచుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లో పెంచుకున్న ఈ జీవులు ఎక్కువ కాలం జీవించడం లేదట. కేవలం ఏడాది వరకు మాత్రమే ప్రాణాలతో ఉండి.. ఆపై చనిపోతుండగా.. ఇప్పుడిప్పుడే వీటి పెంపకాన్ని ఆపేస్తున్నారట.

అయితే బల్లుల జాతికి చెందిన ఇవి ఆకులను ఆహారంగా తింటుటాయట. ఎక్కడో అడవుల్లో పెరుగుతూ.. చెట్లపై ఉండే ఆకులు, పండ్లు తింటూ జీవించే ఇవి.. ఈ మధ్య పంటపొలాల్లోకి వస్తున్నాయట. గుంపులుగా వచ్చి పంటలపై పడుతుండగా.. పొలాలన్నీ నాశనం అవుతున్నాయట. రాత్రి అవి పొలాల్లోకి చొస్తే.. తెల్లారే సరికి పంటలను పూర్తిగా మాయం చేస్తున్నాయట. గతేడాది కూడా ఇదే సమస్య ఎదుర్కున్న తైవాన్.. మరోసారి ఈ సమస్య బారిన పడింది.

Tags:    

Similar News