USA: అమెరికా రక్షణ మంత్రిగా పీట్ హెగ్సెత్
డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా కుష్ దేశాయ్;
అమెరికా రక్షణ మంత్రి(డిఫెన్స్ సెక్రటరీ)గా పీట్ హెగ్సెత్ ఎన్నికను అమెరికా సెనేట్ ధృవీకరించింది. రక్షణ మంత్రిగా పీట్ హెగ్సెత్ పేరును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగానే ఎంపిక చేసినప్పటికీ లైంగిక దాడి, మద్యపాన వ్యసనం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న హెగ్సెత్ ఎన్నికపై సెనేట్‌లో 50 శాతం అనుకూలంగా, 50 శాతం వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ తన ఓటును ఉపయోగించుకుని హెగ్సెత్ గెలుపునకు మార్గం సుగమం చేశారు.
డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా కుష్ దేశాయ్
తన డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా ఇండియన్-అమెరికన్ కుష్ దేశాయ్‌ని ట్రంప్ నియమించుకున్నారు. కుష్ గతంలో జర్నలిస్ట్‌గా పని చేశారు. 2024 రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ డిప్యూటీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా, అయోవా రిపబ్లికన్ పార్టీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పని చేశారు.