ఇజ్రాయిల్-హమాస్ మధ్య జరుగుతోన్న యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు దాదాపుగా 1600 మంది మృత్యువాతపడగా.. వేలమంది గాయాల బారినపడ్డారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్‌పై హమాస్ టెర్రర్ గ్రూప్ చేస్తున్న దాడులను ఖండిస్తూ.. ఆ దేశానికి అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాలు మద్దతుగా నిలిచాయి. ఈ క్రమంలోనే భారతదేశం కూడా ఇజ్రాయిల్‌కు తమ మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఘర్షణలు మొదలైన రోజే ఇజ్రాయెల్‌కు అండగా ప్రకటన చేసిన మోదీకి.. మంగళవారం నెతన్యాహు ఫోన్ చేశారు. హమాస్ టెర్రర్ గ్రూప్‌తో జరుగుతోన్న యుద్ధంపై, ఇజ్రాయిల్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడారు. ఈ విషయాన్ని మోదీ ట్వీట్ ద్వారా తెలియజేశారు. భారతీయులంతా ఇజ్రాయెల్ పక్షమేనని పేర్కొన్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌కు బాసటగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్ స్వీయ రక్షణ చర్యలకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మోదీ మధ్య మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే.ప్రారంభం అయినా వెంటనే మోడీ ఇజ్రాయిల్ కు మద్దతు ప్రకటించారు. అయితే యుద్ధం విషయంలో ఇరు నేతల మధ్య సంభాషణ జరగడం మాత్రం ఇదే మొదటిసారి.
మరోవైపు తమ దేశంలో చొరబడి ఘర్షణలకు పాల్పడుతున్న హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టేందుకు ఇజ్రాయిల్ సైన్యం భీకరంగా పోరాడుతోంది. పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లోని హామాస్ స్థావరాలపై వైమానిక దాడులు చేస్తోంది. అలాగే ఇప్పటికే ఇజ్రాయిల్ భూభాగంలోకి ఎంటరైన 1500 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు ఇజ్రాయిల్ సైన్యం వెల్లడించింది. ఇక ఈ యుద్ధం నేపధ్యంలో తన దేశ ప్రజలను ఉద్దేశించిన నెతన్యాహు.. ‘తమ దేశంపై దాడికి దిగి.. హమాస్ తప్పు చేసిందని.. అందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ యుద్ధం మొదలుపెట్టింది హమాస్ అని.. కానీ ముగించేది మాత్రం తామేనని’ అన్నారు.
తన సోషల్ మీడియా ఎక్స్‌లో ప్రధాని పోస్ట్ చేస్తూ “నాకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించినందుకు ప్రధాని నెతన్యాహుకు ధన్యవాదాలు” అని రాశారు. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలు ఇజ్రాయెల్‌కు అండగా నిలిచారని అన్నారు. అన్ని రకాలుగా ఉగ్రవాదాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోందని ఉద్ఘాటించారు. ఇజ్రాయెల్‌పై పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ శనివారం జరిపిన రాకెట్ దాడిని ఉగ్రవాద దాడిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఇజ్రాయెల్‌లో జరిగిన ఉగ్రవాద దాడి వార్తతో షాక్‌కు గురైనట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు. అలాగే ఈ దాడిలో మరణించినవారి కుటుంబాలకు ప్రధాని మోదీ తన సానుభూతిని తెలియజేశారు.