PM Modi : ఈరోజు సాయంత్రం ‘సబర్మతి రిపోర్ట్‌’ సినిమా చూడనున్న మోడీ

న్యూఢిల్లీలోని బాలయోగి ఆడిటోరియంలో మూవీ వీక్షణ;

Update: 2024-12-02 06:15 GMT

 ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు సోమవారం సాయంత్రం 4 గంటలకు ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని వీక్షించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో నటించారు. గుజరాత్‌లోని గోద్రా ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. న్యూఢిల్లీలోని బాలయోగి ఆడిటోరియంలో ప్రధానమంత్రి ఈ చిత్రాన్ని వీక్షిస్తారు.

ది సబర్మతి రిపోర్ట్ చిత్రం గత నెల నవంబర్ 15న థియేటర్లలో విడుదలైంది. గోద్రా రైలు దుర్ఘటనపై ఆ తర్వాత చెలరేగిన అల్లర్ల ఆధారంగ తెరకెక్కిన ‘‘ది సబర్మతీ రిపోర్ట్’’ సినిమాపై ప్రధాని నరేంద్రమోడీ గతంలో ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటన వెనక ఉన్న నిజాన్ని వెల్లడించినందుకు చిత్రాన్ని కొనియాడారు. ‘‘నకిలీ కథనం పరిమిత కాలం మాత్రమే కొనసాగుతుంది’’ అని మోడీ అన్నారు. ఈ నిజం బయటకు రావడం మంచిదని కొనియాడారు.

అసలు ఏంటి ఈ గోద్రా విషాదం?

ఫిబ్రవరి 27, 2002 ఉదయం సబర్మతి ఎక్స్‌ప్రెస్ గుజరాత్‌లోని గోద్రా రైల్వే స్టేషన్‌కి వచ్చింది. బీహార్‌లోని ముజఫర్ పూర్ నుంచి గుజరాత్‌లో అహ్మదాబాద్ వరకు నడుస్తున్న ఈ రైలులో వందలాది మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ రైలులోనే అయోధ్యలో మతపరమైన సమావేశం నుంచి తిరిగి వస్తున్న కరసేవకులు ఉన్నారు. రైలు గోద్రా నుంచి బయలుదేరే సమయంలో ఎమర్జెన్సీ చైన్‌ని చాలా సార్లు లాగినట్లు డ్రైవర్ తెలిపారు.

దీనివల్ల స్టేషన్ వెలువలి సిగ్నల్ వద్ద రైలు ఆగిపోయింది. ఆ తర్వాత భారీ దాడి జరిగింది. 2000 మంది వ్యక్తుల గుంపు రైలుపై రాళ్లను రువ్వారు. నాలుగు కోచ్‌లను తగలబెట్టారు. S-6 కోచ్ ఎక్కువగా ప్రభావితమైంది మరియు అగ్నిప్రమాదంలో 27 మంది మహిళలు మరియు 10 మంది పిల్లలు సహా 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరో 48 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గోద్రా తర్వాత గుజరాత్ అంతటా అల్లర్లు జరిగాయి. తీవ్రమైన మతకలహాల్లో హిందువులు, ముస్లింలు చనిపోయారు.

Tags:    

Similar News