Prague university shooting : యూనివర్సిటీలో కాల్పుల కలకలం

15మంది మృతి, మరో 9మంది పరిస్థితి విషమం;

Update: 2023-12-22 01:30 GMT

చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. జన్ పలాచ్ స్క్వేర్ లోని చార్లస్ విశ్వవిద్యాలయంలో ఓ సాయుధుడు బీభత్సం సృష్టించారు. ఫిలాసఫీ విభాగం భవనంలో విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల్లో 14 మంది మరణించగా 20మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు.... ఘటనాస్థలికి చేరుకొని దుండగుడిని మట్టబెట్టారు. బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించారు. యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. కాల్పుల జరిగిన భవనంలో... ఇంకా పేలుడు పదార్థాలు ఉండొచ్చనే అనుమానంతో సోదాలు నిర్వహించారు. దుండగుడు అదే యూనివర్సిటీకి చెందిన విద్యార్థిగా అధికారులు గుర్తించారు. కాల్పుల ఘటన వెనుక ఏ తీవ్రవాద సంస్థలు లేవని చెక్ అంతర్గత శాఖ మంత్రి విట్ రాకుసన్ స్పష్టం చేశారు. విచారణలో ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.

చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని నగరమైన ప్రాగ్‌లోని చార్ల్స్ యూనివర్సిటీలో ఓ దండుగుడైన విద్యార్థి జరిపిన సమూహకాల్పుల్లో 15 మంది మృతి చెందగా, మరో 30 మంది గాయపడినట్లు చెక్‌ పోలీసులు గురువారం తెలిపారు. కాల్పులకు పాల్పడిన విద్యార్థి కూడా ఈ ఘటనలో మృతి చెందాడు. నగరంలోని జాన్‌ పాలాహ్‌ కూడలిలో ఉన్న చెర్ల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలోని ఆర్ట్స్ విభాగం వద్ద ఈ కాల్పులు జరిగాయి.

అయితే, నిందితుడు తొలుత తన తండ్రిని చంపి ఆపై యూనివర్శిటీలో కాల్పులకు తెగబడినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టిన తరుణంలోనే ప్రాగ్ నగరానికి చేరుకుని ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీస్ చీఫ్ మార్టిన్ వాండ్రసెక్ తెలిపారు. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రాగ్ వస్తున్న నిందితుడి కోసం పోలీసులు ఆర్ట్స్ విభాగం భవంతిలో గాలిస్తుండగా అతడు మరో భవంతిలోకి వెళ్ళాడు.

కాగా, రష్యాలో గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని, దాన్ని స్ఫూర్తిగా తీసుకునే నిందితుడు ఈ దారుణానికి పాల్పడివుంటాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఘటనపై ఐరోపా దేశాధినేతలు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 1993 స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత చెక్ రిపబ్లిక్‌లో జరిగిన అత్యంత దారుణ ఘటన ఇదే కావడం గమనార్హం. 

Tags:    

Similar News