Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ నాయకుడి మరణం
ఆరోగ్యం కుంగిపోతున్నా.. కనికరం లేకుండా:
బంగ్లాదేశ్ లో హిందూ మైనారిటీ వర్గంపట్ల వివక్ష కొనసాగుతూనే ఉన్నది. తాజాగా చోటుచేసుకున్న మరో ఘటననే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అవామీ లీగ్‌కు చెందిన మాజీ నాయకుడు 18 నెలలుగా జైల్లోనే మగ్గుతూ ప్రాణాలు కోల్పోయాడు. అవామీ లీగ్ మాజీ నేత, 86 ఏళ్ల రమేషన్ చంద్ర సేన్ (Rameshan Chandra Sen) విద్యావేత్త. బంగ్లాదేశ్ ఎంపీగా, మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహంచారు.
అయితే ఏ తప్పూ చేయకున్నా గడిచిన 18 నెలలుగా ఆయన జైల్లో మగ్గుతున్నారు. దాంతో ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది. తన ఆరోగ్యం క్షీణిస్తున్నదని పలుమార్లు కోర్టుకు వెల్లడించినా బెయిల్ మాత్రం రాలేదు. దాంతో ఆయన జైల్లోనే ఆరోగ్యం మరింత విషమించి ప్రాణాలు కోల్పోయారు. అయితే 18 నెలలు జైల్లోనే ఉన్నా అక్కడి ప్రజలకు సేన్‌పై అభిమానం తగ్గలేదు. బంగ్లాదేశ్‌లో విద్యారంగం, రాజకీయాల్లో కొన్ని దశాబ్దాలుగా ఆయన ఎన్నో సేవలు చేశారు.
ఇదిలావుంటే 18 నెలల క్రితం ఓ అల్లరిమూక ఆయనపై దాడి చేయగా.. పోలీసులు సేన్‌నే అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌కుగల కారణాలను కూడా సరిగ్గా వెల్లడించలేదు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఒక కేసు తర్వాత మరో కేసును ఆయనపై బనాయిస్తూ వచ్చారు. ఏ కేసులో అయినా బయటి వచ్చే అవకాశం ఉందంటే.. మరో కేసు మోపారు. కాగా ఈ నెల 11న అవామీ లీగ్‌కు చెందిన హిందూ నేత ప్రళయ్ చాకీ కూడా పోలీసుల కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయారు.