Ukrain-Russia: కీలక పోర్ట్‌పై రష్యా దాడి, ఆహార సంక్షోభం తప్పదా..?

Update: 2023-07-19 03:46 GMT

ఉక్రెయిన్‌(Ukrain) దక్షిణ ప్రాంతంలోని కీలకమైన ఒడెసా(Odesa Port) పోర్ట్‌పై రష్యా డ్రోన్(Drones)లు, మిస్సైళ్ల(Missiles)తో దాడి చేసింది. గత సంవత్సరం యుఎన్(UN-United Nations) మధ్యవర్తత్వంతో కుదిరిన ఆహార ధాన్యాల ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ఈ దాడులు చేసింది. అంతేకాకుండా సోమవారం రష్యాకు-కీవ్‌కి అనుసంధానంగా ఉన్న కీలకమైన కెర్చ్ బ్రిడ్జిని ఉక్రెయిన్‌ సముద్రం నుంచి ప్రయోగించే డ్రోన్లతో కూలివేయడంతో రగిలిపోయిన రష్యా దానికి ప్రతీకార చర్యగానే ఈ దాడులకు పాల్పడింది. ఈ ఒప్పందం నుంచి బయటకు రష్యా బయటకు రావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆకలి సంక్షోభం ఎక్కువయ్యే ప్రమాదం ఉందని యూఎన్ హెచ్చరించింది. ఆహారధాన్యాల ఒప్పందం అధికారికంగా సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు.


"ఉక్రెయిన్‌ ఆహార ఎగుమతులపై ఆధారపడిన వివిధ దేశాల్లోని 40 కోట్ల మంది జీవితాల్ని ప్రమాదంలోకి నెట్టాలన్న రష్యా ఆలోచనకు ఇది మరో రుజువు" అని ఉక్రెయిన్ అధ్యక్షుడి కార్యాలయ సిబ్బంది వ్యాఖ్యానించారు.

ఉక్రెయిన్‌కు సముద్రం ద్వారా ధాన్యాన్ని ఎగుమతి చేయడానికి ఈ ఒప్పందం అనుమతిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరల్ని స్థిరంగా ఉంచడం, ఉక్రెయిన్ ఎగుమతులపై ఆధారపడిన దేశాలకు ఉపశమనం కలిగించడానికి ఈ ఒప్పందం చాలా కీలకమైంది.


ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలోని ఒడెసా తీరప్రాంతం, మైకోలైవ్‌ ప్రాంతాల్లో నల్ల సముద్రం నుంచి ప్రయోగించిన రష్యాకి చెందిన 6 క్యాలిబర్ మిస్సైల్స్, 31 డ్రోన్లని కూల్చివేసినట్టు ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది. దాడులకు సంబంధించిన పలు శకలాలు ఇళ్లపై పడటంతో తీవ్రంగా నష్టం జరిగిందని అధికారులు వెల్లడించారు.

గత నెలలో రష్యా దాడులకు ప్రతీకార దాడులు మొదలు పెట్టిన ఉక్రెయిన్, దక్షిణ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్ని, తూర్పు ప్రాంతంలోని బఖ్మత్ పరిసర ప్రాంతాల్ని తమ వశం చేసుకోగలిగింది. గత సంవత్సరం ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకున్న భూభాగంలో ఫ్రంట్ లైన్ స్ట్రిప్‌తో పాటు ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలోని బఖ్‌ముట్‌కు ఉత్తరాన దాడితో తిరిగి రావడానికి రష్యా దళాలు ఇప్పుడు ప్రయత్నిస్తున్నాయని ఉక్రేనియన్ కమాండర్లు తెలిపారు.


Tags:    

Similar News