ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణులతో దాడి
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత నగరంపై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. దాడుల్లో ఓ ఐదంతస్తుల అపార్ట్‌మెంట్ భవనం సహా పలు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.;
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత నగరంపై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. దాడుల్లో ఓ ఐదంతస్తుల అపార్ట్‌మెంట్ భవనం సహా పలు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు ముగ్గురు చనిపోగా,దాదాపు 25 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. దాడిలో దెబ్బతిన్న ఐదంతస్తుల భవనం ఇప్పటికీ మంటల్లోనే చిక్కుకొని ఉంది.మరోవైపు కీవ్‌పై కూడా రష్యా దాడులను కొనసాగించింది. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాల్లో గగనతల రక్షణ వ్యవస్థ సైరన్ మోగుతూనే ఉంది. ప్రధానంగా పౌర నివాసాలపై రష్యా డ్రోన్లు దాడులు చేసినట్లు తెలిపారు. ఇక క్రైవీ రిహ్‌పై రష్యా దాడులు చేయడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఖండించారు.