Russia Plane Missing: 50 మందితో వెళుతున్న‌ ర‌ష్యా విమానం అదృశ్యం

ఆందోళనలో ప్రయాణికుల కుటుంబాలు

Update: 2025-07-24 06:15 GMT

ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం మరువక ముందే బంగ్లాదేశ్‌లో ఒక విమానం స్కూల్‌పై కూలిపోయి పదుల కొద్ది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇక అహ్మదాబాద్ ప్రమాదంలో 271 మంది దుర్మరణం చెందారు. ఇలా ఎక్కడొక చోట యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా రష్యాలో ఒక ప్యాసింజర్ విమానం అదృశ్యమైంది. దీంతో ప్రయాణికుల కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.

రష్యా తూర్పు ప్రాంతంలోని టిండా సమీపంలో దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్న అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏఎన్-24 ప్రయాణీకుల విమానం అదృశ్యమైంది. అముర్ ప్రాంతంలోని తూర్పు ప్రాంతంలో అదృశ్యమైనట్లు వార్తా సంస్థ ఇంటర్‌ఫ్యాక్స్ తెలిపింది. ఖబరోవ్స్క్-బ్లాగోవెష్‌చెన్స్క్-టిండా మార్గంలో ప్రయాణిస్తుండగా.. గమ్యస్థానానికి చేరుకొనే సమయంలో సంబంధాలు తెగిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

విమానంలో ఇద్దరు పిల్లలు సహా 40 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. టిండా విమానాశ్రయానికి మొదటి ల్యాండింగ్ విఫలమైన తర్వాత రెండో ల్యాండింగ్ సమయంలో విమానం అదృశ్యమైనట్లుగా ఇంటర్ ఫ్యాక్స్ పేర్కొంది. విమానాశ్రయం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో సంబంధాలు తెగిపోయినట్లుగా సమాచారం. ఇక రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News