Vladimir Putin : పుతిన్‌కు పెద్ద షాక్.. కూతురికి విడాకులు ఇచ్చిన అల్లుడు
Vladimir Putin : ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించినప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ మరియు అతని కుటుంబం నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.;
Vladimir Putin : ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించినప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ మరియు అతని కుటుంబం నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తాజాగా పుతిన్‌కి పెద్ద షాక్ తగిలినట్టుగా తెలుస్తోంది. పుతిన్ కుమార్తె మారియా వైవాహిక బంధం తెగిపోయిందని సమాచారం.
మారియా వివాహం డచ్ వ్యాపారవేత్త అయిన జోరిట్ ఫాసెన్‌తో జరిగింది. ఈ దంపతులకి ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడిపోవడానికి ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడుల ఎఫెక్టేనని తెలుస్తోంది. ఎందుకంటే ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించినప్పటి నుంచి పుతిన్ పైన ప్రపంచదేశాలు ఆగ్రహంగా ఉన్నాయి.
ఎన్ని చర్చలు పెట్టినప్పటికీ పుతిన్ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా విచక్షణా రహితంగా చేస్తున్న దాడులను పుతిన్ కుటుంబీకులు కూడా అసహ్యించుకుంటున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో వీరిద్దరూ విడిపోయారని తెలుస్తోంది.
కాగా పుతిన్‌కు మరియా పుతినా, యెకటెరీనా పుతినా అనే ఇద్దరు కూతుళ్ళున్నారు. పుతిన్ పెద్ద కూతురు మరియా ఎండోక్రినాలజిస్టుగా పని చేస్తున్నారు.