Chandra Grahan 2025 : నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం

ఆసియా దేశాల్లో, ఆఫ్రికాలోని తూర్పు ప్రాంతాల్లో, పశ్చిమ ఆస్ట్రేలియాలో దర్శనం

Update: 2025-09-07 02:00 GMT

నేడు (ఆదివారం) సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. దీనిని ‘బ్లడ్‌ మూన్‌’ అని పిలుస్తారు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినపుడు, భూమి నీడ చంద్రునిపై పడుతుంది. అప్పుడు గాఢమైన ఎరుపు రంగు దర్శనమిస్తుంది. భారత్‌, చైనా సహా ఆసియా దేశాల్లో, ఆఫ్రికాలోని తూర్పు ప్రాంతాల్లో, పశ్చిమ ఆస్ట్రేలియాలో ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం కనిపిస్తుంది.

ఈ గ్రహణం భారత్‌లో ఆదివారం రాత్రి 11 గంటలకు ప్రారంభమై, అర్ధరాత్రి 12.22 గంటలకు ముగుస్తుంది. స్పర్శ కాలం ఆదివారం రాత్రి 10.01 గంటలకు ప్రారంభమవుతుంది. యూరోప్‌, ఆఫ్రికా దేశాల్లో పాక్షిక చంద్ర గ్రహణం కనిపిస్తుంది. అమెరికాలో ఇది కొంచెం కూడా కనిపించదు.

  • ఆదివారం రాత్రి 8.58 గంటలకు గ్రహణం ప్రారంభం కానుంది. 11 గంటల నుంచి 12.22 వరకు సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. సోమవారం తెల్లవారుజామున 2.25 గంటలకు గ్రహణం వీడనుంది.
  • మేఘాలు లేకుంటే దిల్లీ, ముంబయి, కోల్‌కతా, పుణె, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో సంపూర్ణ చంద్ర గ్రహణం కనిపించనుంది. 
Tags:    

Similar News