ఖగోళంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. సౌరకుటుంబంలో తొమ్మిది గ్రాహాల్లో ఫ్లూటోని గ్రాహానికి జాబితా నుంచి తొలగించారు. దీంతో ఇప్పుడున్న గ్రహాల సంఖ్య ఎనిమిది మాత్రమే. వాటిలో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా శని గ్రహానికి ఉన్న ప్రత్యేకమైన వలయాలు ఆకర్షణీయంగా నిలుస్తోంది. అయితే అవి కొన్ని రోజులపాటు అదృశ్యం కానున్నాయి. ఈ ప్రక్రియ ఆదివారం రాత్రి 9.34 గంటలకు మొదలైంది.
నిజానికి ఈ వలయాలు పూర్తిగా మాయమైపోవు. కానీ, భూమిపై నుంచి చూసినప్పుడు మనకు అలా భ్రాంతి కలుగుతుంది. ఇది తాత్కాలికమే, రెండురోజుల్లో వలయాలు సాధారణంగా కనిపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. శని గ్రహం సూర్యుడి చుట్టూ పరిభ్రమించేందుకు 29.4 సంవత్సరాలు పడుతుంది. ఒక్కసారి కక్ష్య చుట్టూ తిరిగే క్రమంలో ఈ వలయాల అదృశ్యం రెండు సార్లు జరుగుతుంది. ఈ అద్భుతం ప్రతి 13,15 ఏండ్లకు ఒకసారి జరుగుతుంది. ఇది మళ్లీ 2038లో జరిగే ఆస్కారముంది.