Gaza: గాజా శరణార్థులపై కాల్పులు.. 118 మంది మృతి!

అమెరికా భద్రతా దళాలు ఘాతుకం..;

Update: 2025-07-04 05:30 GMT

గాజా-ఇజ్రాయెల్ మధ్య 60 రోజులు కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయినా కూడా గాజాపై దాడులు ఆగడం లేదు. ఇంకోవైపు హమాస్‌ను అంతం చేసేదాకా వదిలిపెట్టబోమని నెతన్యాహు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే గాజాలో పరిస్థితులు ఏ మాత్రం బాగోలేదు. తిండి లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. కొన్ని సంస్థలు మానవతా సాయం అందిస్తున్నాయి. అయితే మానవతా సాయం ముసుగులో మారణహోమం సృష్టిస్తున్నారని గాజా ఆరోగ్య శాఖ ఆరోపించింది. గత 24 గంటల్లో అమెరికా భద్రతా కాంట్రాక్టర్లు జరిపిన కాల్పుల్లో 118 మంది చనిపోయారని తెలిపింది.

ప్రస్తుతం అమెరికాకు చెందిన గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ సంస్థ.. నాలుగు క్యాంప్‌లు ఏర్పాటు చేసి సాయం అందిస్తోంది. అయితే పంపిణీ దగ్గర అమెరికాకు చెందిన గార్డులు మోహరించాయి. వారి సమక్షంలోనే ఆహారం, నిత్యావసర వస్తువులు పంపిణీ జరుగుతోంది. అలా పంపిణీ జరుగుతుండగా గార్డులు జరిపిన దాడుల్లో 118 మంది చనిపోయినట్లు గాజా ఆరోగ్య శాఖ ఆరోపించింది. అయితే శరణార్థుల ముసుగులో కొంత మంది తుఫాకులు, బాంబులు చేతపట్టుకుని వచ్చిన వారిపై గార్డులు కాల్పులు జరిపినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలను ఫౌండేషన్ ఖండించింది. పౌరులపై ఎలాంటి కాల్పులు జరగలేదని పేర్కొంది. అయితే కొంత మంది భారీగా ఆయుధాలు కలిగి ఉన్నవారు ప్రత్యక్షమైనట్లు గార్డులు పేర్కొన్నారు.

ఇక జీహెచ్ఎఫ్ ఫౌండేషన్‌పై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మానవతా సాయం ముసుగులో ఇజ్రాయెల్‌కు మద్దతుగా కాల్పులు జరుపుతోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపించింది. ఆ సంస్థ మానవతా సూత్రాలకు కట్టుబడి ఉండదని ఆరోపించింది.

Tags:    

Similar News