Singapore PM : భారత ఎంపీలపై సింగపూర్‌ ప్రధాని కీలక వ్యాఖ్యలు..!

Singapore PM : సింగపూర్‌ ప్రధానమంత్రి లీ సీన్‌ లూంగ్‌ తాజాగా భారత్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

Update: 2022-02-18 01:30 GMT

Singapore PM : సింగపూర్‌ ప్రధానమంత్రి లీ సీన్‌ లూంగ్‌ తాజాగా భారత్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సింగపూర్‌ పార్లమెంట్‌లో రైతు కూలీ చట్టంపై చర్చ సందర్భంగా ప్రసంగిస్తున్న సమయంలో భారత పార్లమెంట్‌ గురించి ప్రస్తావించారు ప్రధాని లీ సీన్‌ లూంగ్‌.

తొలితరం నేతలు ఎంతో ఆదర్శప్రాయులుగా కొనసాగినా... ప్రస్తుతం అలాంటి నేతలు లేరన్నారు. నెహ్రూ వంటి మహోన్నత నేత పరిపాలించిన భారత్‌లో ఇప్పుడున్న పరిస్థితులే అందకు నిదర్శనమన్నారు. సగానికిపైగా భారత ఎంపీలు క్రిమినల్‌ అభియోగాలు ఎదుర్కొంటున్నారంటూ వ్యాఖ్యానించారు.


సింగపూర్‌ ప్రధాని వ్యాఖ్యల పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్‌లో సింగపూర్‌ రాయబారి సైమన్‌ వాంగ్‌కు...విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సమన్లు జారీ చేసింది. సింగపూర్‌ ప్రధాని పార్లమెంట్‌లో చేసిన ఈ వ్యాఖ్యలు అసందర్బోచితంగా ఉన్నాయని నిరసన వ్యక్తం చేసింది. లీ సీన్‌ లూంగ్‌ వ్యాఖ్యలపై వివరణ కావాలని స్పష్టం చేసింది.

నెహ్రూ గురించి పొగిడి... ఇప్పుడున్న ఎంపీలపై కామెంట్‌ చేయడంపై కేంద్రం సీరియస్‌గా ఉంది. ఓ దేశ చట్టసభలో మరో దేశంపై ఎలా కామెంట్‌ చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేంద్రం పంపిన సమస్లకు.. సింగపూర్‌ ప్రభుత్వం ఎలాంటి సమాధానమిస్తున్నది ఇప్పుడు చూడాలి.

Tags:    

Similar News