Taslima Nasreen: తాలిబన్ పాక్ ను కూడా కలబళిస్తుంది...

కరాచీ పేలుళ్ల ఘటనపై స్పందంచిన వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రీన్....;

Update: 2023-02-18 06:34 GMT

పాకిస్థాన్ లోని చోటుచేసుకున్న పేలుళ్లపై వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రీన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరాచీలోని పోలీస్ స్థావరంలోకి దూసుకువచ్చిన ఆత్మాహుతి దళ సభ్యులు విధ్వంసం సృష్టించారు. వారికీ పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు తరీఖ్ ఏ తాలిబన్ సంస్థ సభ్యులతో పాటూ తొమ్మది మంది మృతి చెందారు. దీంతో పాకిస్థాన్ లో తాలిబన్ ల చీకటి క్రీడ ప్రారంభమమైందని తస్లీమా ట్వీట్ చేసింది. పాకిస్థాన్ ను కబళించేందుకు  ISIS అవసరం లేదని, ఈ దాడులు ఇలానే కొనసాగితే తాలిబన్ పాకిస్థాన్ ను పూర్తిగా హస్తగతం చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తస్లిమా ట్వీట్ వైరల్ గా మారింది. బంగ్లాదేశ్ కు చెందిన తస్లిమా నస్రీన్ వివాదాస్పదన రచనలతో 1994లోనే దేశ బహిష్కరణకు గురయ్యారు. అప్పటి నుంచి భారత్ ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు పాకిస్థాన్ లో వరుస దాడులకు పాల్పడుతున్న తరీఖ్ ఏ తాలిబన్, ఆఫ్గనిస్థాన్ తాలిబన్ లకూ ఎన్నో సారూప్యతలు ఉన్నాయి. ఇటీవలే మసీదు పై జరిగిన దాడి కూడా ఈ సంస్థకు చెందిన సభ్యులే చేశారని తెలుస్తోంది. ఈ ఘటనలో సుమారు 80మంది పోలీసులు అమరులైన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News