Mystery Temple: ఆ ఆలయంలోకి వెళితే మరణమే..

Mystery Temple: తెలిసి తెలిసి ఎవరైనా ఆ ఆలయంలోకి అడుగుపెడతారా.. అంతటి సాహసం చేస్తారా.

Update: 2022-02-19 11:46 GMT

Mystery Temple: సహజంగా భక్తులు దేవాలయానికి ఎందుకు వెళతారు.. మనసు ప్రశాంతతకు, ఆరోగ్యాన్ని ప్రసాదించమని, ఐశ్వర్యాన్ని కలిగించమని దేవుడిని కోరుకుంటారు.. కానీ ఎవరైనా చావును కోరుకుంటారా.. కానీ ఆ ఆలయంలోకి వెళితే కోరికలు కోరుకునేది ఏమీ ఉండదు.. ఏకంగా పైకి వెళ్లిపోవడమే.. తెలిసి తెలిసి ఎవరైనా ఆ ఆలయంలోకి అడుగుపెడతారా.. అంతటి సాహసం చేస్తారా.


కానీ అలాంటి ఆలయం ఎక్కడ ఉందీ తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం అందరికీ ఉంటుంది. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందంటే.. దక్షిణ టర్కీలోని పాముక్కలే సమీపంలో ఉంది. ఆలయంలో పక్షులు, జంతువులు చనిపోవడంతో ఈ విషయం తెరపైకి వచ్చింది. ఈ ఆలయాన్ని స్థానికులు "నరకాని ద్వారం " అని పిలుస్తారు.

మరణాల మిస్టరీని శాస్త్రవేత్తలు ఛేదించారు. ఆలయం కింద నుంచి విషపూరితమైన కార్బన్ డై ఆక్సైడ్ వాయువు నిరంతరం బయటకు వస్తోందని, దీని వల్ల మనుషులు, జంతువులు, పక్షులు చనిపోతున్నాయని శాస్త్రవేత్తలు  భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ప్రకారం, ఆలయం దిగువన ఉన్న గుహలో పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ వాయువు కనుగొనబడింది. అలాగే, సాధారణంగా 10 శాతం కార్బన్ డయాక్సైడ్ కేవలం 30 నిమిషాల్లో ఎవరినైనా నిద్రపోయేలా చేయగలదు, గుహ లోపల ఈ విష వాయువు మొత్తం 91 శాతం వరకు ఉందని తేల్చారు. 

Tags:    

Similar News