Texas Firing: టెక్సాస్‌లో కాల్పులు.. ముగ్గురు మృతి

నిందితుడు అరెస్ట్;

Update: 2025-08-12 03:00 GMT

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్‌లోని ఆస్టిన్ టార్గెట్ పార్కింగ్ స్థలంలో ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.

టెక్సాస్‌లోని ఆస్టిన్‌లోని టార్గెట్ స్టోర్ పార్కింగ్ స్థలం దగ్గర మానసిక రుగ్మతతో బాధపడుతున్న 30 ఏళ్ల యువకుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. సంఘటనాస్థలిలోనే ముగ్గురు ప్రాణాలు వదిలారు. అనంతరం నిందితుడు పారిపోతూ రెండు వాహనాలు దొంగిలించాడు. ఆస్టిన్ పోలీస్ చీఫ్ లిసా డేవిస్ మాట్లాడుతూ.. అనుమానితుడిని దక్షిణ ఆస్టిన్‌లో దాదాపు 32 కిలోమీటర్ల దూరంలో పట్టుకున్నట్లు తెలిపింది.

అయితే ఈ సంఘటనపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పౌరులకు రక్షణ కల్పించడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. దేశానికి మెరుగైన భద్రత అవసరం అంటూ నిలదీశారు. తక్షణమే ట్రంప్, గ్రేగ్ అబాట్ మంగళవారం తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక బాధితుల గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. నలుగురు బాధితులు ఉండొచ్చని పేర్కొన్నారు. కాల్పులకు కారణాలేంటో కూడా తెలియజేయలేదు. ప్రస్తుతం కేసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News