Thailand: మద్యాహ్నం మద్యం సేవిస్తే భారీ జరిమానా.. కొత్త మద్యం చట్టం అమలు..

థాయిలాండ్‌లో రిటైల్ అవుట్‌లెట్‌లు, సూపర్ మార్కెట్‌లలో సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం ఐదు దశాబ్దాలకు పైగా అమలులో ఉంది.

Update: 2025-11-08 08:31 GMT

శనివారం నుండి థాయిలాండ్‌లో మద్యాహ్నం మద్యం సేవిస్తే ఆల్కహాల్ నియంత్రణ చట్టాల కింద భారీ జరిమానాలు విధిస్తారు. నవంబర్ 8 నుండి అమలులోకి వచ్చే ఈ చట్టం, నిషేధిత సమయాల్లో లేదా నిషేధిత ప్రదేశాలలో మద్యం సేవించిన వ్యక్తులకు కనీసం 10,000 భాట్ ($300) జరిమానాలు విధిస్తుంది.ఇది 1972లో మొదటిసారిగా రూపుదిద్దుకున్నప్పటికీ ఇప్పటి నుండి మరింత కఠినంగా ఈ చట్టం అమలవుతుందని బ్లూమ్ బెర్గ్ నివేదిక తెలిపింది. 

లైసెన్స్ పొందిన వినోద వేదికలు, హోటళ్ళు, సర్టిఫైడ్ పర్యాటక సంస్థలు, అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్‌లకు చట్టం మినహాయింపులు ఇస్తుండగా, ఈ మార్పులు తమ వ్యాపారానికి హాని కలిగిస్తాయని రెస్టారెంట్ యజమానులు అంటున్నారు. "కొత్త నిబంధనలు రెస్టారెంట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి అని థాయ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు చానన్ కోట్చారోయెన్ అన్నారు.

సెక్షన్ 32 ను ఉటంకిస్తూ, "ఒక సంస్థ ఒక కస్టమర్‌కు మధ్యాహ్నం 1:59 గంటలకు బీరు బాటిల్‌ను అమ్మితే, వారు మధ్యాహ్నం 2:05 వరకు కూర్చుని తాగితే, అది చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. ఇది రెస్టారెంట్ పరిశ్రమ వృద్ధికి ఆటంకం కలిగిస్తుంది" అని ఆయన వివరించారు.

మరికొందరు కఠినమైన అమలు దుర్వినియోగానికి మార్గాలను తెరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. "అధికారులు ఈ చట్టాలను ఉపయోగించి వ్యక్తిగత లాభం కోసం కస్టమర్లకు లేదా వ్యాపారాలకు జరిమానా విధించవచ్చు" అని బ్యాంకాక్‌కు చెందిన రెస్టారెంట్ యజమాని వ్యాఖ్యానించారు.

ప్రతిపక్షం కూడా ఈ సవరణను విమర్శించింది. పీపుల్స్ పార్టీ పార్లమెంటు సభ్యుడు టావోపిఫాప్ లిమ్‌జిట్రాకార్న్ మాట్లాడుతూ, ఈ చర్య వ్యాపార, పర్యాటక అవసరాలకు విరుద్ధంగా ఉందని అన్నారు. "సవరించిన చట్టం మద్యాన్ని వ్యతిరేకించే వారి ప్రయోజనాలను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకుంది" అని ఆయన అన్నారు.

కొత్త నియమాలు విదేశీ పర్యాటకులను గందరగోళానికి గురిచేస్తాయని లిమ్జిట్రాకార్న్ అన్నారు. ఈ నిబంధనలు థాయిలాండ్ ఆతిథ్య ఖ్యాతిని దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 

Tags:    

Similar News