Thailand: బౌద్ధసన్యాసులకు వలపు వల.. ప్రయివేట్ వీడియోలతో రూ. 102 కోట్లు వసూల్..

9 మంది బౌద్ద సన్యాసులతో సంబంధాలు;

Update: 2025-07-19 02:00 GMT

థాయ్‌లాండ్‌లో ఓ యువతి విసిరిన వలపు వల ఆ దేశాన్ని షేక్ చేస్తోంది. ఏకంగా బౌద్ధ సన్యాసులనే ట్రాప్ చేసింది ఆ యువతి. అంతే కాదు మూడేళ్ల నుంచి వారి వద్ద నుంచి రూ. 102 కోట్లు కొల్లగొట్టింది. 2024లో ఈ యువతి హనీ ట్రాప్ షురూ చేసింది. ఓ సన్యాసితో సంబంధం ఏర్పరచుకుంది. వారికి ఒక బిడ్డ కూడా జన్మించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఖర్చుల కోసం రూ. 1.81 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసింది. ఆ బౌద్ధ సన్యాసి నుంచి డబ్బులు గుంజిన తర్వాత అదే తరహా మోసానికి అలవాటు పడింది మిస్ గోల్ఫ్. ఈ విధంగానే మరో 9 మందితో లైంగిక సంబంధాలు పెట్టుకుంది. వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసుకోవడం.. బెదిరించడం.. డబ్బులు గుంజడం నిత్యకృత్యంగా పెట్టుకుంది. ఇలా ఏకంగా వారి నుంచి 3 ఏళ్లలో 102 కోట్ల రూపాయల వరకు లాగింది.

ఇటీవల జూన్‌లో ఒకరు సన్యాసానికి దూరమయ్యారు. దీంతో పోలీసులు ఈ అంశంపై దృష్టి సారించారు. దీంతో మిస్ గోల్ఫ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమెను అరెస్ట్ చేసి విచారించారు. ఆమె.. బౌద్ధ సన్యాసులను మోసం చేయడానికి దాదాపు 80 వేల ఫోటోలు, వీడియోలు తీసినట్లు గుర్తించారు. ఇప్పుడు ఆమెపై పోలీసులు మనీలాండరింగ్, దోపిడీ తదితర కేసులు నమోదు చేశారు. ఇటీవల థాయ్‌లాండ్‌లో సన్యాసులు లైంగిక, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాల్లో పాల్గొంటున్నారనే విమర్శలు అధికమయ్యాయి. ఇప్పుడు ఈ ఘటన అక్కడి బౌద్ధ సంస్థను మరింతగా కుదిపేసింది. ఈ ఘటనపై థాయ్ బౌద్ధానికి సంబంధించిన పాలక సంస్థ సంఘ సుప్రీం కౌన్సిల్ తీవ్రంగా స్పందించింది. సన్యాసుల విషయంలో ఉన్న నియమ నిబంధనలను సమీక్షిస్తామని తెలిపింది. మొత్తంగా బౌద్ధసన్యాసుల అంశం ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటనతో థాయ్‌లాండ్ చక్రవర్తి 81 మంది బౌద్ధ సాధువులకు ఉన్న రాయల్ హోదాను రద్దు చేశారు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు..

Tags:    

Similar News